రీ విజిట్‌..దూరం

23 Dec, 2019 00:52 IST|Sakshi

అఫ్సర్‌ నలభై యేళ్ల సమగ్ర కవిత్వం (1979–2019) ‘అప్పటినుంచి ఇప్పటిదాకా’ ఈ శుక్రవారం సాలార్జంగ్‌ మ్యూజియంలో ఆవిష్కరణ అయింది. ప్రచురణ: చిత్రలేఖ ప్రొడక్షన్స్‌. దానికిముందు కవి జీవితపథాన్ని తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు, ఒక వీడియో ప్రదర్శించారు(ప్రొడ్యూసర్‌: కిరణ్‌ చర్ల), కొన్ని కవితల్ని ఫ్రేములు కట్టి వేలాడదీశారు. ఏ కవి అయినా కలలుగనే, ఎంతటివారికైనా పట్టదేమో అనిపించేంతటి యోగం! సాహిత్య పోషకుడు బి.నర్సింగరావు ఇల్లే ఇది సాధ్యపడి ఉంటుంది. ఫ్రేముల్లోని ఒక కవిత:

దూరం
మరణాన్ని అడిగి
ఓ మూడు క్షణాలు
అరువు తెచ్చుకున్నాను.

మరుక్షణం 
మరణం నెత్తిమీద
నా నాలుగో క్షణాన్ని
యుద్ధానికి పంపాను.

తీగ మీద నడక
ఎంత కష్టం!

ప్రతీసారి తీగమీద ఆరేయలేక
రాలిపోయిన ఎన్ని మాటల్ని
ఎన్ని శ్వాసల్ని ఏరుకుని
మళ్ళా
జేబులో దోపుకొని వచ్చేస్తుంటానో!
పలికిన మాటల మధ్య
పలకని మాటల నిశ్శబ్దం బాధిస్తుంది.

పెదాల చప్పుడొక్కటే విని
గుండె చప్పుడిని
సమాధి చేసుకుని 
వెనక్కి వచ్చేస్తాను.
-అఫ్సర్‌

మరిన్ని వార్తలు