... జాబిలి వెలిగేను మనకోసమే

2 Jul, 2018 02:03 IST|Sakshi
పదం పలికింది పాట నిలిచింది

పదం పలికింది పాట నిలిచింది

ఈ లోకమంతా మన కోసమే ఉందా? ఇందులోని అందం, కాంతి? నచ్చిన మనిషి  చెంతవుంటే అలా అనిపించకుండా ఎలా ఉంటుంది? వెన్నెల మనకోసమే కాస్తుంది. పూవులు మనకోసమే పూస్తాయి. ప్రేమికుల ఈ అతిశయపు మనఃస్థితిని దాశరథి ఎంత సున్నితంగా ఆవిష్కరించారు! వాగ్దానం చిత్రం కోసం ఆయన ‘నా కంటిపాపలో నిలిచిపోరా/ నీ వెంట లోకాల గెలువనీరా’ పాట రాశారు. ఈ రెండు వాక్యాలు వాటికవే సాటి. మళ్లీ చరణంలో–
‘ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో జాబిలి వెలిగేను మనకోసమే
నియ్యాలలో తలపుటుయ్యాలలో అందుకొందాము అందని ఆకాశమే’ అని ముందు నాయిక, తర్వాత నాయకుడు పాడుకుంటారు.
‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా

మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాల చేరుదమా’ అంటూ దాన్ని తర్వాతి చరణంలో కొనసాగిస్తారు.
1961లో వచ్చిన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం పెండ్యాల నాగేశ్వరరావు. పాడిందేమో సుశీల, ఘంటసాల. నటీనటులు కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆచార్య ఆత్రేయ కావడం విశేషం, పాటలేవీ రాయకుండా.
 

మరిన్ని వార్తలు