వహ్వాళి

7 Nov, 2018 01:05 IST|Sakshi

పండగ ప్రత్యేకం

పండగ వేళ అమ్మాయిలునట్టింట తిరగాడుతూ ఉంటే..ఆ ఇంట లక్ష్మీ కళ తొణికిసలాడుతుంది. దీపకాంతులతో పోటీపడుతూ అమ్మాయిలు లంగా ఓణీలతో ముస్తాబు అయితే..స్వయంగా లక్ష్మీదేవియే నట్టింట్లో కోటికాంతులై కొలువుదీరుతుంది. చూపుల తోరణాలన్నీఈ దీపావళి వేళ వహ్వాళి అనకుండా ఉండలేవు.

సంప్రదాయ వేడుక అంటే చాలు ఈ తరం అమ్మాయిలతో పాటు యంగ్‌ అమ్మలు కూడా ముచ్చటపడి ధరించే దుస్తులు లంగా ఓణీలు. వీటిని పండగ వేళ మరికాస్త కళగా  ఇలా ధరించవచ్చు. 

సిల్క్‌ శాటిన్‌ 
ఈ లెహెంగాలన్నీ సిల్క్‌ శాటిన్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసినవి. రాసిల్క్, వెల్వెట్‌..తో డిజైన్‌ చేసిన లెహంగాలు బరువుగా ఉంటాయి. అదే, సిల్క్‌ శాటిన్‌ అయితే మంచి ఫాల్‌ ఉండటంతో పాటు ఫ్యాబ్రిక్‌ బరువు ఉండదు. ఈ ఫ్యాబ్రిక్‌ కలర్స్‌ లుక్‌ని మరింత బ్రైట్‌గా మార్చేస్తాయి. ఈ లెహెంగాల మీద జర్దోసీ, సీక్వెన్స్, థ్రెడ్, గోల్డ్‌ జరీతో పూర్తిగా హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేయడంతో గ్రాండ్‌గా మెరిసిపోతున్నాయి. నాటి కాలంలో బాగా ఆకట్టుకున్న మోటివ్‌ డిజైన్స్‌లో మార్పులు తీసుకొచ్చి ఎంబ్రాయిడరీ చేయడంతో వీటికి మరింత కళ వచ్చింది. 

నెటెడ్‌ దుపట్టా 
జర్దోసీ, గోల్డ్‌ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన నెటెడ్‌ దుపట్టాలు ఇవన్నీ. లెహెంగా– బ్లౌజ్‌కు మరింత కాంతిమంతమైన లుక్‌ రావాలంటే దుపట్టా కలర్‌కాంబినేషన్‌ ఎంపికలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పండగ లేదా వేడుక సందర్భాన్ని బట్టి ఇలాంటి రంగుల కాంబినేషన్‌లో డిజైన్‌ చేయించుకోవచ్చు.

సిల్క్‌ చందేరీ బ్లౌజ్‌
బాడీ పార్ట్‌ మొత్తం చెక్స్‌ ఉన్న సిల్క్‌ చందేరీ ఫ్యాబ్రిక్‌ను తీసుకున్నాం. చేతుల భాగాన్ని  పూర్తి ఎంబ్రాయిడరీ చేశాం.  

రంగుల ముచ్చట
సాధారణంగా లంగాఓణీ ధరించేవారు లెహెంగా రంగులోనే జాకెట్టు కూడా ఎంపిక చేసుకుంటారు. కానీ లంగా, ఓణీ, జాకెట్టు.. ఇలా మూడూ మూడు విభిన్నరంగుల కాంబినేషన్‌లోనూ ధరించవచ్చు. ఫ్యాబ్రిక్స్‌లోనూ ఆ తేడా చూపించవచ్చు. ఇక్కడ ఇచ్చిన డిజైనర్‌ లంగా ఓణీలకు సిల్క్‌ శాటిన్, నెటెడ్, చెక్స్‌ చందేరీ క్లాత్‌లను  ఉపయోగించాను.  మూడు ముచ్చటైన రంగుల కాంబినేషన్‌తో డిజైన్‌ చేస్తే వచ్చిన లంగా ఓణీ కళ ఇది.
భార్గవి కూనమ్‌
ఫ్యాషన్‌ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌