పాజిటివిటీకి... కల్లుప్పు!

12 Dec, 2016 15:17 IST|Sakshi
పాజిటివిటీకి... కల్లుప్పు!

మీకు తెలుసా?

ఆత్మశుద్ధి, దేహశుద్ధి రెండింటికీ ఒకే మందు కల్లుప్పు. దీన్నే గల్లుప్పు, నల్లుప్పు, రాళ్ల్లుప్పు, రాతి ఉప్పు - ఇలా రకరకాలుగా పిలుస్తారు. పేరైదైనా‘ నైస్’గా తయారుచేసే‘క్రిస్టల్ సాల్ట్’ కాకుండా పెద్ద పెద్ద కణాలుగా ఉండే నేచురల్ రాతి ఉప్పుకు మాత్రమే ఈ శుద్ధి పవర్ ఉందన్న వాస్తవాన్ని ఇప్పుడు అంతటా ఒప్పుకుంటున్నారు. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకు అతి చిన్న అంశమే పరిష్కారం. అది ఉప్పుతోనే మొదలైతే...!

శక్తి కారకం
సముద్రతీరంలో విశాల మైదానాలలో ఉప్పు చేరుతుంది. ఎండిన ఉప్పు చెరువుల్లోనూ ఉప్పును గమనించవచ్చు. ఇది స్వచ్ఛంగా ఉంటుంది, మన పూర్వీకులు దీనినే వాడేవారు. కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల కొద్దిగా గులాబీ రంగు, లేదంటే కొద్దిగా నీలం రంగులో ఉంటుంది. ఆయుర్వేద మందులలో ఈ ఉప్పునే ఉపయోగిస్తారు. ఈ ఉప్పు గుండె ఆరోగ్యానికి మేలు. మధుమేహం, ఆస్టియో పొరోసిస్, డిప్రెషన్, స్ట్రెస్, కండరాల నొప్పులు, తల దిమ్ముగా అనిపించడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. జీర్ణశక్తికి, చర్మ సమస్యలకు, ఎముకలు గుల్ల బారడం వంటి ఎన్నో ఆరోగ్య సమస్య లకు ఇది ఔషధం.

ఆధ్యాత్మికతకు దారి
మనం గుర్తించలేని ఆధ్యాత్మిక శక్తి ఎంతో ఉప్పులో ఉంది. మన లోని నిరాశను తరిమే స్తుంది. చెడు ప్రభావాల్ని దూరం చేస్తుంది. కల్లుప్పు పాజిటివ్ శక్తిని త్వరగా ఆకట్టు కుంటుంది. చెడు శక్తిని అంతే త్వరగా దూరం చేస్తుంది. అందుకే దిష్టి తీయడంలో ఈ రాతి ఉప్పును వాడుతుంటారు పెద్దలు. ధ్యానం చేసే చోట ఉప్పు నింపిన చిన్న పాత్రను ఎదురుగా ఉంచండి. ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది.

నెగిటివ్ దూరం
సూర్యాస్తమయ వేళ కర్పూరాన్నీ, ఉప్పునూ కలిపి వెలిగిస్తే ఆ వాసనకు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఒక చిన్న గిన్నెలో ఉప్పు, కర్పూరం కలిపి 40 రోజుల పాటు ఉంచితే ఇంటి వాతావరణం మారిపోతుంది. ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా దూరమే. లోలోపలి నెగిటివ్ ఆలోచనలు ఈర్ష్య, అహాలు దూరమై పోతాయి.  స్నానం చేయడానికి ముందు ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును రోజూ మీ బాత్‌రూమ్‌లో ఒక చోట ఉంచండి. అలాగే స్నానం చేసేటప్పుడు స్క్రబ్ కోసం కొద్దిగా రాళ్ల ఉప్పును తల నుంచి పాదాల వరకు ఉపయోగించండి. స్నానం చేసిన(ఉప్పుతో రుద్దిన తర్వాత సబ్బును ఉపయోగించకూడదు) తర్వాత పరిశీలించండి. ఇలా రోజూ వారం రోజులు, మళ్లీ నెల రోజుల తర్వాత ఇలాగే చేయండి. మీలోని నెగిటివ్ ఆలోచనలే కాదు మిమ్మల్ని బయట నుంచి ఆవహించే చెడూ దూరం అవుతుంది.

ఉదయం గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసి మెల్లగా సేవించండి. మీ శరీర అంతర్గత వ్యవస్థ శుభ్రపడుతుంది. (అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి).  ఇల్లు, ఆఫీస్ ఫ్లోర్లను తుడిచేటప్పుడు ఉప్పు నీటిని ఉపయోగించండి. వరుసగా వారం రోజుల నుంచి నెల రోజులు చేసి చూడండి. అక్కడి వాతావరణం మీకెంత పాజిటివ్‌గా ఉంటుందో తెలుస్తుంది.

 - చిల్కమర్రి

మరిన్ని వార్తలు