ఉల్లి, టమాటాలతో అలర్జీ తుమ్ములు దూరం!

9 Nov, 2017 23:46 IST|Sakshi

చిట్కా చికిత్స

మీకు దుమ్ము వల్ల అలర్జీయా? దుప్పట్లు దుపలగానే తుమ్ములు మొదలవుతాయా? మీరు ఓ చిన్న చిట్కా పాటించండి. ఇకపై గోధుమలు, అరటిపండ్లు, ఉల్లి, బార్లీ, చికోరీ, టమాటా, చిలగడదుంప వంటివి కాస్త ఎక్కువగా తినండి. అలర్జీలు దూరమవుతాయంటున్నారు జపాన్‌లోని పరిశోధకులు. కొన్ని ఎలుకలపై పరిశోధనల్లో ఈ విషయం తేలింది. వారు తొలుత ఎలుకలకు డస్ట్‌మైట్స్‌తో అలర్జీ కలిగించారు.

ఇక వాటికి ‘ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్‌’ ఎక్కువగా ఉండే ఆహారం ఇస్తూ వచ్చారు. తీరా పరిశీలిస్తే... మామూలు ఆహారంపై ఉన్న ఎలుకలతో పోలిస్తే ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్‌ ఉండే ఆహారం తిన్నవి చాలా ఆరోగ్యంగా ఉండి, అలర్జీలను సమర్థంగా ఎదుర్కొన్నాయి. అందుకే అలర్జీలను అరికట్టడానికి ఫ్రక్టో ఆలిగో సాకరైడ్స్‌ ఉండే గోధుమ, అరటి, ఉల్లి, వెల్లుల్లి వంటివి మంచివంటున్నారు పరిశోధకులు. మీరూ కాస్త ట్రై చేస్తారా?

మరిన్ని వార్తలు