ఒక వైపే చూడొద్దు..

7 Aug, 2018 18:05 IST|Sakshi

లండన్‌ : జీవితంలో ఎప్పుడూ అంతా మంచే జరుగుతుందని ఒక వైపే చూడటం శ్రేయస్కరం కాదని తాజా అథ్యయనం పేర్కొంది. ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా గడ్డు పరిస్థితులను దీటుగా అధిగమించేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడి కొన్ని సందర్భాల్లో మేలు చేస్తుందని, కుంగుబాటును సమర్ధంగా ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు.

యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ సైకాలజిస్టులు చేపట్టిన అథ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆశావహ దృక్పథం కలిగిన వారు సమయానుకూలంగా స్పందించడంలో తడబడితే, ఒత్తిడిని ఎదుర్కొనేవారు ఇలాంటి పరిస్థితులను సానుకూల దృక్పధంతో తీసుకోవడంతో పాటు వాటికి అనుగుణంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారని తమ అథ్యయనంలో వారు గుర్తించారు.

ఒత్తిడి మానవాళికి కొత్తేమీ కాదని, మన శరీరంలో ఉండే ఒత్తిడిని ఎదుర్కొనే వ్యవస్థ మనకు మేలు చేస్తుందని ప్రమాదకర పరిస్థితుల్లో ఇది మనల్ని అప్రమత్తం చేస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ నీల్‌ గారెట్‌ చెప్పారు. అయితే ఒత్తిడి హార్మోన్లను మెరుగ్గా నిర్వహించడంతోనే మేలు చేకూరుతుందని, నిరంతర ఒత్తిడి మంచిది కాదని అథ్యయనం స్పష్టం చేసింది. అథ్యయన వివరాలు

మరిన్ని వార్తలు