తొక్కతోనూ లాభాలు

29 Feb, 2020 13:17 IST|Sakshi

అన్ని పండ్ల తొక్కల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకని వాటిని ఆహారంగా తీసుకోలేం కదా. అయితే తొక్కే కదా అని తీసిపారేయకండి. వాటిని మరోలా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలు అందానికి బాగా ఉపయోగపడతాయని ఇంతకు ముందు చాలా సార్లు తెలుసుకున్నాం. బకెట్‌ నీళ్ళలో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించి, ఆ నీళ్లతో స్నానం చేయాలి. నిమ్మతొక్కల్లోని సిట్రిక్‌ యాసిడ్‌ వల్ల చర్మం మృదువుగా అవుతుంది.

  •   బయట ఎక్కువగా తీరుతున్న వారికి చర్మంపై దుమ్ముచేరి, కమిలిపోతుంది. అలసటకు కూడా గురవుతారు.
  •   అలాంటప్పుడు అరటిపండు తొక్కతో ముఖమంతా మర్దనా చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.
  •   బొప్పాయి గుజ్జుతో ఫేసియల్‌ చేయడం అందరికీ తెలుసు.
  •   వీటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి దీన్ని కూడా ప్యాక్‌ గా వేసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే డెడ్‌ స్కిన్‌ తొలగిపోతుంది.
  •   యాపిల్‌ తొక్కను కూడా మిక్సీ చేసి ముఖానికి పట్టించాలి.నెమ్మదిగా మర్దన చేస్తే, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది.
  •   నారింజ తొక్కలు కూడా సున్నిపిండిలో వేసి మర పట్టిస్తే చర్మం మృదువుగా అవుతుంది.
  •  దీన్ని కూడా నీళ్ళలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మంలోని వ్యర్థాలు బయటికి పోతాయి.
  •  అలాగే తొక్కల గుజ్జుతో ప్యాక్‌ చేసుకుంటే నల్లని మచ్చలు, కంటికింద వలయాలు తగ్గుతాయి.
  •  నిద్రనుంచి లేచినప్పుడు కొందరి ముఖం ఉబ్బి పోతుంది.
  • ఇది తగ్గాలంటే బంగాళా దుంప తొక్కలు ఉడికించిన నీటితో ముఖం కడుక్కుంటే ఉబ్బిన చర్మం మామూలుగా అయిపోతుంది.
  • అలాగే ఉడికిన తొక్కల్ని ప్యాక్‌ గా చేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది.
మరిన్ని వార్తలు