పాదాల ప్యాడ్‌మ్యాన్‌

30 Nov, 2017 23:23 IST|Sakshi

అక్షయ్‌ కుమార్, అమితాబ్‌ బచ్చన్‌ కలిసి నటించిన సినిమాలెన్నో. ‘ఆంఖే, ‘వక్త్‌’, రిష్తా, ఖాకీ వగైరా. ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘ప్యాడ్‌మ్యాన్‌’ లో కూడా అమితాబ్‌ బచ్చన్‌ ఒక కేమియో రోల్‌ వేస్తున్నాడు. కాసేపే కనబడినా, అదరగొట్టే రోల్‌. అరుణాచలం మురుగనాథన్‌ అనే ఒక దార్శనికుడి గురించి ఈ సినిమా. రుతుక్రమంలో ఆడపిల్లలు వాడుకునే ప్యాడ్‌లు అన్ని చోట్లా లభ్యం కానందువల్ల మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ లేక కష్టపడుతున్న మన బంగారు తల్లుల కోసం మురుగనాథన్‌ ఒక మెషీన్‌ తయారుచేశాడు. దీని ద్వారా ఊళ్లల్లో ఉన్న ఆడపిల్లలకు చౌక ధరకు నాణ్యమైన శానిటరీ నాప్‌కిన్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

మురుగనాథన్‌ పాత్ర వెయ్యడానికి అక్షయ్‌ కుమార్‌ ఒప్పుకోవడం చాలామందికి సంతోషాన్ని కలిగించింది. సామాజిక స్పృహ ఉన్న ఉద్యమకారుడి పాత్ర ఇది. ఈ ప్యాడ్‌మ్యాన్‌ మొన్న అమితాబ్‌ బచ్చన్‌కు ‘ఇఫీ’ ఫెస్టివల్‌లో ‘ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ఇస్తున్న సందర్భంలో ఎమోషనల్‌గా మాట్లాడడమే కాకుండా, ఆయన పాదాలకు నమస్కారం కూడా చేశాడు. అమితాబ్‌ బచ్చన్‌కి అది ఇబ్బందిగా అనిపించింది. ‘మనం సముజ్జీవులం. పైగా సమాజ సేవ కోసం నీ అంత నేను చేయలేదు’ అన్నట్లుగా అమితాబ్‌ బచ్చన్‌ ఫీల్‌ అయ్యారట. అలా అమితాబ్‌ బచ్చన్‌ పాదాల దగ్గర ప్యాడ్‌మ్యాన్‌ స్టోరీ రక్తి కట్టింది.  

మరిన్ని వార్తలు