ప్రాచీన ప్రదేశాలు... ఆధునిక నామధేయాలు

7 Jan, 2018 01:29 IST|Sakshi

1.    మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం – దేవ్‌ ధాం, నేపాల్‌.
2.    నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం, ఆంధ్రప్రదేశ్‌.
3.    జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్‌ ప్రదేశ్‌.
4.    మాహిష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) – మహేశ్వర్, మధ్యప్రదేశ్‌
5.    శమంత పంచకం (పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) దుర్యోధనుని చంపిన చోటు–కురుక్షేత్ర, హర్యానా
6.    పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి, సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్రతీర ప్రాంతం
7.    మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) – పశ్చిమ ఒరిస్సా
8.    నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్‌ జిల్లా, మధ్యప్రదేశ్‌
9.    వ్యాస మహర్షి పుట్టిన స్థలం– ధమౌలి, నేపాల్‌
10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించిన ప్రాంతం) – సీతాపూర్‌ జిల్లా, ఉత్తర్‌ ప్రదేశ్‌
11.    వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు– మన గ్రామం, ఉత్తరాంచల్‌
12.    ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) –ఝాన్సీ,అలహాబాద్‌.
13.    సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)–కురుక్షేత్ర దగ్గర.
14.    హస్తినాపురం (కౌరవుల రాజధాని) – హస్తినాపూర్, ఉత్తర్‌ ప్రదేశ్‌.
15.    మధుపురం / మధువనం (కంసుని రాజధాని) –మధుర, ఉత్తర్‌ ప్రదేశ్‌.
16.    వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర.
17.    కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) – గ్వాలియర్‌.
18.    మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్‌ ప్రావిన్స్, పాకిస్తాన్‌.
19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)–డెహ్రాడూన్‌.
20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) – గురుగావ్, హర్యానా.

మరిన్ని వార్తలు