ఉలి అలికిడి విన్నంతనే..

20 Aug, 2018 00:18 IST|Sakshi
అమరశిల్పి జక్కన్న

పదం పలికింది – పాట నిలిచింది

బండరాళ్ల ఊతంగా గుండెలు నిండే మాటలు పలికాడు సి.నారాయణరెడ్డి. అమరశిల్పి జక్కన్న చిత్రం కోసం ఆయన రాసిన ‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో / ఈ బండల మాటునా ఏ గుండెలు మ్రోగెనో’ పాటలో రాళ్లు మొత్తం సజీవమూర్తులుగా కనబడతాయి. శిల్పిగా జక్కన్న కూడా చేసింది అదేగా, రాళ్లలో రాగాలు పలికించడం!
రాళ్లు ఏ కళంకం అంటకుండా మునీశ్వరుల్లా మూలన ఉన్నాయట. రాయి కదలలేదు, కానీ ఉలి అలికిడికి ఉప్పొంగుతుందట. పైన కఠినంగా ఉన్నా దాన్ని చెక్కే మనిషికి అది వెన్నలా కరిగిపోతుందది. మొత్తంగా దీన్నంతటినీ మనిషి స్వభావానికి అన్వయించాడు సినారె.
‘పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి 
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి 
‘కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే జలజలమని పొంగిపొరలు
‘పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును 
ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది ఎస్‌.రాజేశ్వరరావు. పాడింది ఘంటసాల. 1964లో వచ్చిన ఈ చిత్రానికి బి.ఎస్‌.రంగా దర్శక నిర్మాత. బి.సరోజాదేవి, అక్కినేని నాగేశ్వరరావు నటీనటులు.

మరిన్ని వార్తలు