పోనీ టెయిల్‌ వేశాడు ఫ్యాషన్‌ బొమ్మను చేశాడు

3 Nov, 2019 02:47 IST|Sakshi

ఫ్రెంచి కుర్రాడు

అనుష్కశర్మ – విరాట్‌ కోహ్లీ... మోస్ట్‌ డిజైరబుల్‌ కపుల్‌. ఒకరు సినీతార, ఒకరు క్రీడా తార. ఇద్దరిదీ గ్లామర్‌ ఫీల్డే. సినీతారలైతే వెండి తెర మీదే కాదు బయట కూడా బంగారు బొమ్మల్లా అందంగా కనపడాలనుకుంటారు. అంతర్జాతీయ డ్రెస్‌ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. ఇప్పుడు మేకప్, హెయిర్‌ స్టయిల్స్‌కి కూడా నిపుణులను ఎంచుకుంటున్నారు. బ్రిటన్‌తోపాటు ఇతర ఐరోపా దేశాల నుంచి, అమెరికాల నుంచి ప్రత్యేకమైన హెయిర్‌ స్టయిలిస్ట్‌లను పిలిచి, ఫ్యాషన్‌ ప్రపంచంలో కొత్త రకమైన హెయిర్‌ స్టయిల్‌తో కొత్తగా కనపడాలనుకుంటున్నారు.

అనుష్క శర్మ కూడా మరింత వినూత్నంగా కనిపించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్‌ నుంచి ఫ్లోరియన్‌ హ్యూరెల్‌ అనే హెయిర్‌ స్టయిలిస్టుని రప్పించుకున్నారు. వచ్చీరాగానే అనుష్కను అందాల బొమ్మలా చూపించడానికి ఫ్లోరియన్‌ హ్యూరెల్‌ తహతహలాడారు. ‘‘అక్టోబరు 27, దీపావళి రోజున అనుష్క శర్మను దీపకాంతులలో తళతళలాడుతూ, సంప్రదాయం ఉట్టిపడేలా, అందమైన పురాతన చిత్రపటంలా రెడీ చేయాలనుకున్నాను. జుట్టును లూజ్‌గా వదిలే యడం లేదా పోనీ టెయిల్‌ కట్టాలనుకున్నాను.

పోనీ టెయిల్‌ అయితే చాలా అందంగా ఉంటుంది అనిపించింది. అంతే. వెంటనే అరేబియన్‌ గుర్రం తోకలాంటి పోనీటెయిల్‌ కట్టేశాను. ఆ చిన్న మార్పుతోనే అనుష్కశర్మ కళ్లలో కాంతులు కనిపించాయి’’ అని గుర్తు చేసుకున్నాడు ఈ ఫ్రెంచి స్టెయిలిష్‌ కుర్రవాడు. ‘ద స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో ప్రియాంక చోప్రాకు కూడా అతడు పనిచేశాడు. ‘అనుష్కశర్మ, విరాట్‌కోహ్లీ జంట అంటే నాకు చాలా ఇష్టం. అనుష్కశర్మ  పర్‌ఫెక్ట్‌గా కనిపించడం కోసం నాకే చాయిస్‌ ఇస్తారు’ అని అంటాడు హ్యూరెల్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా