యాప్‌ ఆకలి తగ్గించుకోండి

10 Dec, 2017 00:29 IST|Sakshi

మార్కెట్‌లో ఆపిల్‌పండు దొరుకుద్దోలేదో తెలీదుగానీ, దొరికినా కొనగలుగుతామో లేదో తెలియదు కానీ, తిన్నా ఆరోగ్యంగా ఉంటామో లేదో తెలియదు కానీ, తిన్నది కాశ్మీర్‌దా ఆస్ట్రేలియాదా అర్థం కాదు కానీ, యాప్‌లు మాత్రం అందరికీ అర్థమౌతున్నాయి. ముక్కు తుడుచుకోడానికి, మూతి తుడుచుకోడానికి కూడా యాప్‌లు ఉన్నాయి.

యాప్‌లకు అంత వ్యాప్తి ఉంది. ‘ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్‌ పూస్తా’ లాంటి యాప్‌లు కూడా ఉన్నాయి. కానీ ఆకలి కాక ముందే మీకు ఆకలి ఎప్పుడు వేస్తుందో కనుక్కుని, మీ ఆకలిని నింపడానికి కూడా యాప్‌ ఉందట! వెటకారం అయినా, వచ్చినా వస్తుంది లెండి అలాంటిది.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో మీ ఎత్తు, బరువు, లైక్స్, డిస్‌లైక్స్, మీ పేరెంట్‌ జీన్సు, మీరు చదువుకున్న చదువు, మీరు ఏడుస్తున్న ఉద్యోగం వగైరా వగైరా వగైరాలను బట్టి మీకు ఆకలి వెయ్యకముందే ఈ కొత్త యాప్‌ గంట కొట్టుద్దంట. కొట్టి, మీకిష్టమైన ఫుడ్డు ప్యాక్‌ చేసి పంపిస్తుందట. ‘ఔరా! నిజమేనా..’ అంటూ ఓ ప్రబుద్ధుడు.. ‘మరి ముద్ద కలిపి నోట్లో కూడా పెట్టుద్దా?’ అని అడిగాడట. ఇదమ్మా నేటి యటకారం వైరలు.

>
మరిన్ని వార్తలు