ఐ టీవీ వస్తోందా?!

16 Nov, 2013 00:00 IST|Sakshi

ఒకవైపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై తన ముద్రను వేసి మాయను కొనసాగిస్తున్న ఆపిల్ కంపెనీ ఐ టీవీ రూపంలో ప్రపంచాన్ని పలకరించనుందా? ప్రస్తుతం ఆ కంపెనీ ఐ టీవీ లేదా ఆపిల్ టీవీని రూపొందించే పనిలో ఉందా? ఇప్పటికే ఆపిల్ ఉత్పత్తులకు అడిక్ట్ అయినవారిలో ఆసక్తిని రేపుతున్న రూమర్లివి. ఆపిల్ కంపెనీ రూపొందించబోయే టీవీ కూడా ఐ ఫోన్‌లాగే అందరినీ ఆకట్టుకొంటుందని, కర్వ్‌డ్ స్క్రీన్‌తో ఉంటుందని.. వార్తలు వస్తున్నాయి. అయితే ఆపిల్ నుంచి ఈ విషయంలో ఎటువంటి ధ్రువీకరణ లేదు.
 
లెనోవో యోగా ట్యాబ్లెట్ వచ్చేసింది..


లెనోవో కంపెనీ తన ఉత్పత్తి అయిన యోగా ట్యాబ్లెట్ 8, యోగా ట్యాబ్లెట్ 10 లను ఇండియాకి తీసుకువచ్చింది. లెనోవో యోగా ట్యాబ్లెట్ 8 (8 ఇంచెస్) యోగా ట్యాబ్లెట్ 10 (10 ఇంచెస్) ధరలు వరసగా రూ.22,999, రూ.28,999. ఈ రెండు ట్యాబ్లెట్లూ ఆండ్రాయిడ్ 4.2.2. జెల్లీబీన్ వెర్షన్‌పై పనిచేస్తాయి.16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో 64జీబీ వరకూ మైక్రోఎస్‌డీ కార్డ్‌తో పరిమితిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 ఎమ్‌పీ ఆటోఫోకస్ రేర్ కెమెరా, 1.6 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో పనిచేస్తాయి. సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 8 ఇంచ్ ట్యాబ్లెట్ వాయిస్ కాలింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
 
కొత్త లుక్‌లో బింగ్!


బింగ్  సెర్చింజన్ న్యూలుక్‌తో ముందుకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ దీన్ని ప్రారంభిం చింది. ఇంగ్లిష్ సెర్చ్ రిజల్ట్స్ విషయంలో, ఇమేజ్, వీడియో రిజల్ట్స్ విషయంలో బింగ్ గూగుల్‌కు పోటీనిస్తోంది. అయితే ప్రాంతీయ భాషల్లో సపోర్ట్ చేయకపోవడం లోటు అనే చెప్పాలి. తాజాగా ఈ లోటును కూడా కొంతవరకూ పూడ్చింది ఈ సంస్థ. ప్రస్తుతం బింగ్ ఇంగ్లిష్  సహా మొత్తం 40 భాషలను సపోర్ట్ చేస్తోంది. ఇందులో కొన్ని భారతీయ ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయి. కానీ అందులో తెలుగు లేదు మరి..!
 

>
మరిన్ని వార్తలు