తండ్రిగా మీరు బెస్టా?

3 Jul, 2017 23:22 IST|Sakshi
తండ్రిగా మీరు బెస్టా?

సెల్ఫ్‌చెక్‌

చిన్న కుటుంబాలు సంఖ్య పెరగడం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణమైంది. ఈ క్రమంలో భర్తగా, తండ్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలూ మారాయి. మంచిభర్త ఆటోమేటిగ్గా మంచి తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది.

1.  మీరు వారానికి 20 గంటలకంటే ఎక్కువ టైమ్‌ టీవీ చూడడానికి కేటాయిస్తున్నారు.
ఎ. కాదు      బి. అవును

2.    ప్రతిరోజూ పిల్లలతో కనీసం పదిహేను నిమిషాల సమయాన్ని కూడా గడపలేకపోతున్నారు.
ఎ. కాదు      బి. అవును

3.    పిచ్చాపాటిగా కబుర్లు చెబుతూ పిల్లల అభిప్రాయాలను తెలుసుకుంటూ అవసరమైతే వాటిని సరిదిద్దుతారు.
ఎ. అవును     బి. కాదు

4. మీ దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఒత్తిడి కారణంగా లైఫ్‌ పార్ట్‌నర్‌తో గడిపే టైమ్‌ తగ్గుతోంది.
ఎ. కాదు      బి. అవును

5. మీ కుటుంబంలో జరిగే ప్రతి పనిలోనూ ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మీ పాత్ర ఉంటుంది.
ఎ. అవును     బి. కాదు

6.    కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బయటకు వెళ్లిన సందర్భాలకు కొదవలేదు.
ఎ. అవును     బి. కాదు

7.    మీకు వృత్తివ్యాపారాలు– కుటుంబ బాధ్యతలకు మధ్య కచ్చితమైన విభజన రేఖ ఉంది. అలాగే మీ అభిరుచి కోసం కొంత పర్సనల్‌ స్పేస్‌ మిగుల్చుకుంటారు.
ఎ. అవును     బి. కాదు

8.    టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పాటిస్తున్నారు కాబట్టి ఎప్పుడూ కంగారు, ఒత్తిడి లాంటివి ఉండవు. మీ రొటీన్‌లో   వ్యాయామం కూడా ఉంది.
ఎ. అవును     బి. కాదు

మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు మంచి భర్తగా, మంచి తండ్రిగా సక్సెస్‌ అవుతున్నారనుకోవచ్చు,  ‘బి’లు ఎక్కువైతే చక్కని ఫ్యామిలీమేన్‌ కావాలంటే మీరు కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.

 

మరిన్ని వార్తలు