లోపాలను సరిచేసుకుంటారా..?

30 Jul, 2017 23:03 IST|Sakshi
లోపాలను సరిచేసుకుంటారా..?

సెల్ఫ్‌ చెక్‌

ప్రతిమనిషిలోనూ కొన్ని దోషాలు, లోపాలు ఉంటాయి. లోపాలు ఉండటం తప్పు కాదు, కాని వాటిని ఎవరయినా ఎత్తి చూపితే అంగీకరించే ధైర్యం ఉండాలి. వాటిని ఎత్తి చూపినందుకు కోపం తెచ్చుకోక సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మరీ మంచిది.

1.    మీలో ఏ లోపం లేదు, మీరు చేసే పనులన్నీ కరెక్ట్‌ అనుకుంటారు.
ఎ. కాదు     బి. అవును

2.    ఎవరి తప్పు వారికి తెలీదు. అటువంటప్పుడు ఎదుటివారు మీలోని లోపాన్ని ఎత్తిచూపితే సరిచేసుకోవాలనుకుంటారు.
ఎ. అవును     బి. కాదు  

3.    లోపం ఉండటం దోషం కాదు, సరిచేసుకోవాలనుకోకపోవడమే తప్పు.
ఎ. అవును     బి. కాదు
 
4.    లోపాలు లేని మనిషి ఉండరనే మాటను మీరు విశ్వసిస్తారు.
ఎ. అవును     బి. కాదు  

5.    ఎదుటి మనిషిలోని లోపాలను ఎత్తి చూపే ముందు మీలోని లోపాలను సరిదిద్దుకోవాలని మీకు తెలుసు.
ఎ. అవును     బి. కాదు  

6.    ఎదుటి మనిషిలోని లోపాలని కాక సుగుణాల గురించి చర్చించుకోవటం మంచిదనే విషయంతో ఏకీభవిస్తారు.
ఎ. అవును     బి. కాదు  

7.    మీ లోపాలను మీ అంతట మీరే సవరించుకోవాలనే కాంక్ష మీలో ఎక్కువ.
ఎ. అవును     బి. కాదు  

8.    రామకృష్ణ పరమహంస వంటి వారు తనలోని లోపాలను సరిదిద్దుకున్న తరవాతే శిష్యులకు బోధ చేసేవారని మీకు తెలుసు.
ఎ. అవును     బి. కాదు  

9.    లోపం లేని వ్యక్తుల కోసం వెతుకులాడకూడదనే మాటతో మీరే ఏకీభవిస్తారు.
ఎ. కాదు     బి. అవును

10.    భగవంతుడు లోపాలను పెట్టడమే కాక వాటిని సరిదిద్దుకునే విధానాలు కూడా చూపాడని మీరు నమ్ముతారు.
ఎ. అవును     బి. కాదు  

మీ సమాధానాలు ‘ఏ’ లు ఏడు కంటె ఎక్కువ వస్తే లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారని అర్థం. ‘బి’ లు ఏడు వస్తే మీలో ఉన్న లోపాలను అంగీకరించే తత్త్వం మీలో లేనట్లే. ‘ఏ’ లను సూచనలుగా భావించి మీలోని లోపాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.

మరిన్ని వార్తలు