మీరు ఖర్చు మనుషులా?

23 Jul, 2017 23:19 IST|Sakshi
మీరు ఖర్చు మనుషులా?

సెల్ఫ్‌ చెక్‌

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నది సామెత. అగ్రరాజ్యానికైనా, బిల్‌గేట్స్‌కైనా ఇదే సూత్రం. మీరు సరదాలకు పోయి ఇంటిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారా? లేక ఆదా చేసి ఆదాయాన్ని కూడ బెడుతున్నారా? మీరెటు పయనిస్తున్నారో తెలుసుకోవాలంటే స్వయంగా చెక్‌ చేసుకోండి.

1.     మీరు ఓ ఎగ్జిబిషన్‌కి వెళ్లినప్పుడు ఖరీదైన కళాఖండాలు కనిపిస్తే వాటివల్ల ఉపయోగం లేకపోయినా కొనేస్తారు.
ఎ. కాదు     బి. అవును

2.     ఇప్పటి వరకు మీ నెలసరి బడ్జెట్‌కంటే ఎక్కువ మీరు ఖర్చు చేయలేదు.
ఎ. అవును     బి. కాదు

3.    మీ రొటీన్‌ ఉద్యోగంతో పాటు ఆదాయం పెంచుకోవడానికి పార్ట్‌ టైమ్‌ వర్క్‌ కూడా చేస్తుంటారు.
ఎ. అవును     బి. కాదు

4.     బ్యాంక్‌లో సేవింగ్స్‌ చేయటం లేదు.
ఎ. కాదు     బి. అవును

5.     మీ పర్స్‌ సహకరించకపోయినా సరే క్యాబ్‌లలోనే ప్రయాణిస్తారు. ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించడం మీకు నచ్చదు.
ఎ. కాదు     బి. అవును

6.     తరచూ కొత్త డ్రస్‌లు కొంటూనే ఉంటారు.
ఎ. కాదు     బి. అవును

7.     మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చులు అవుతున్నప్పుడు విలాసాలను తగ్గించుకోవడంలో కొంత కఠినంగానే ఉంటారు.
    ఎ. అవును     బి. కాదు

8.     అప్పు చేసి అయినా సరే మీ సరదాలు తీర్చుకుంటారు.
ఎ. కాదు     బి. అవును

‘ఎ’ సమాధానాలు  6 దాటితే మీరు సంసారాన్ని సజావుగా నడిపిస్తున్నారని అర్థం. అనవసర ఖర్చులకు పోకుండా డబ్బు జాగ్రత్త చేస్తుంటారు. ‘బి’ సమాధానాలు 6 కంటే ఎక్కువ వస్తే మీకు డబ్బంటే జాగ్రత్త లేదని అర్థం. అనవసర డాబులకు పోయి అప్పుడప్పుడు బోర్లాపడుతుంటారు.

మరిన్ని వార్తలు