అరచేతి పంట గోరింట

27 Jul, 2013 03:54 IST|Sakshi
అరచేతి పంట గోరింట
 ఆషాఢమాసంలో అతివలు గోరింటాకుతో ఎర్రగా పండిన అరచేతులను చూసుకుని మురిసిపోతుంటారు. గోరింటాకు పొడితో చేతులు, పాదాలపై అందంగా వేసుకున్న డిజైన్లు ఎరుపుదనం నింపుకోవాలంటే కొన్ని చిట్కాలు....
 
  చిక్కని నిమ్మరసం, పంచదార సిరప్‌లో దూది ఉండతో ముంచి, ఆరిన మెహెందీ డిజైన్‌పై అద్దాలి. దీంతో డిజైన్ మరింత ఎర్రగా కనిపిస్తుంది  గోరింటాకు పొడితో వేసుకున్న డిజైన్లు 4-6 గంటల సమయం ఉంచుకుంటే సరిపోతుంది  పెట్టుకున్న డిజైన్ పొడిబారాక నీళ్లతో కడగకుండా, పైపొరను మాత్రం బ్రష్‌తో తొలగించి, నూనె రాసుకోవాలి  చేతులను శుభ్రపరుచుకోవడానికి కనీసం 24 గంటల వరకు సబ్బును ఉపయోగించకూడదు  48 గంటలలోపు ముదురు ఎరుపు, బ్రౌన్ కలర్‌లోకి మారుతుంది.
 
మరిన్ని వార్తలు