రైతన్న రాజ్యం

9 Apr, 2019 09:05 IST|Sakshi

సాగు సంక్షోభంలో చిక్కుకుపోయింది. పూటకో రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర రైతాంగంపై వరాల జల్లు కురిపించింది. అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతల బతుకుల్లో వెలుగు నింపేలా 2019 ఎన్నికల ప్రణాళికలో వినూత్న పథకాలను ప్రకటించింది. పేదరికాన్ని తరిమి కొట్టి ప్రతి రైతును ధనవంతుణ్ణి చేసే పథకాలను రూపొందించింది. పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు  ప్రతి కుటుంబానికి పెట్టుబడి సాయం కింద రూ. 50 వేలు అందజేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడం పట్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో చంద్రబాబు తన తాజా ఎన్నికల ప్రణాళికలో కూడా గతంలో పాడిన పాత పాటనే మళ్లీ పాడడాన్ని ఏవగించుకుంటున్నారు.

మళ్లీ మోసానికి తెర తీసిన చంద్రబాబు
14 నెలల ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ కళ్లారా చూసిన, తెలుసుకున్న ఇక్కట్ల ప్రాతిపదికన ఈ ప్రణాళిక తయారు కావడం గమనార్హం. నవరత్నాలలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు పాదయాత్రతో ఇచ్చిన హామీలను కూడా ఇందులో పొందుపరిచి రైతు బతుకుల్లో వెలుగులు నింపేలా ప్రయత్నం చేశారు. 2004లో అధికారాన్ని చేపట్టినప్పుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఏ విధంగానైతే పెద్ద పీట వేశారో అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ 2019 ఎన్నికల ప్రణాళికను రూపొందించారు. చాలా క్లుప్తంగా అందరికీ అర్థమయే విధంగా... నలుగురి నోళ్లలో నానేలా ఈ ప్రణాళిక ఉంది. రాజన్న రాజ్యంలో రైతులు రాజులా బతికారు. మళ్లీ రాజన్న రాజ్యం తేవాలనే ఉద్దేశంతో రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

రుణ మాఫీ పేరిట మోసం...
చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా వ్యవసాయ రంగానికిచ్చిన ఏ హామీ అమలు కాక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మళ్లీ 2019 ఎన్నికల ప్రణాళికలోనూ అవే హామీలు ఇచ్చి అన్నదాతల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ. 87,612 కోట్ల రుణాలు ఉన్నాయి. ఈ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకుని అధికారాన్ని చేపట్టారు. ఐదేళ్ల తరువాత ఆ రుణాలు వడ్డీలతో కలిసి రూ.1.50 లక్షల కోట్లకు ఎగబాకాయి. రూ.87,612 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటే తొలి సంతకం అని, కోటయ్య కమిషన్‌ అని చెప్పి దారుణంగా కోత వేశారు.

రూ.24 వేల కోట్లు అంటూ మొదటి సంతకం పెట్టారు. ఏడాదికి రూ.3000 కోట్లు ఇచ్చారు. మొన్నటిదాకా ఇచ్చింది కేవలం రూ. 12 వేల కోట్లు మాత్రమే. దాన్ని మరచి పోక మునుపే మళ్లీ ఎన్నికలు రావడంతో మళ్లీ అదే డ్రామా మొదలు పెట్టారు. పాత తరహాలో మోసానికి తెర లేపారు. రైతులు తీసుకున్న అసలు రుణాలు, వడ్డీలు కలిసి రూ.1.50 లక్ష కోట్లకు చేరితే ఈ ఐదేళ్లలో వడ్డీతో కలిపి కేవలం రూ.14 వేల కోట్లు ఇచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ రూ.8 వేల కోట్లు ఇస్తామంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. నిన్ను నమ్మం బాబూ అని రైతులు అంటుంటే రైతులకు పెద్దన్నగా ఉంటానంటూ నమ్మబలుకుతున్నాడు. చంద్రబాబు మాట నమ్మి గతంలో ఓట్లు వేసినందుకు.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా వేలం వేస్తున్న పరిస్థితి. బాబు పుణ్యమాని రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణ పథకం రద్దయింది పావలా వడ్డీ రుణాలు ఊసే లేకుండా పోయింది. ఏ రకంగా చూసినా చంద్రబాబు ఇచ్చిన డబ్బులు రైతుల రుణాలపై వడ్డీలకు కూడా సరిపోని దుస్థితి.

తేడా గమనించండి...
2014 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానంటే చంద్రబాబు రూ.5 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి.. దగా చేశారు. ఏదైనా పంటకు గిట్టుబాటు ధర రానప్పుడు పనికి వచ్చే నిధి ఇది. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద ఈ నిధితో రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి మేలు చేయవచ్చు. ఆ పని చేయకపోవడంతో రైతులు వేల కోట్లలో నష్టపోయారు. కంది, పెసర, మినుము, మిర్చి, మొక్కజొన్న, టమాటా, ఉల్లి వంటి పంటల్ని రైతులు కారు చౌకగా అమ్ముకున్నారు. ఈ దశలో జగన్‌ తన ఎన్నికల ప్రణాళికలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారు.

నేనున్నానంటున్న జగన్‌...
రాష్ట్రంలో ప్రతి నిత్యం సగటున ఇద్దరు ముగ్గురు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటుంటే చీమ కుట్టినట్టయినా లేని చంద్రబాబు 2019 ఎన్నికల ప్రణాళికలో ఆ ఊసే లేకుండా చేశారు. ప్రమాదవశాత్తూ్త మరణించే లేదా బలవన్మరణాలకు పాల్పడే రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం కింద రూ.7 లక్షల సాయం అందిస్తానని వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తే చంద్రబాబు ఆ చావుల్ని అసలు గుర్తించడానికే నిరాకరించారు. ఆత్మహత్యలకు పాల్పడే కుటుంబాలకు ఇచ్చే రూ.7 లక్షల డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకు వస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. కౌలు రైతులపై కూడా వరాల జల్లు కురిపించడంతో రైతు సంఘాలు హర్షిస్తున్నాయి. బీమా పథకం ద్వారా 17 లక్షల మంది కౌలు రైతులు కూడా లబ్ధి పొందుతారు.– ఆకుల అమరయ్య, చీఫ్‌  రిపోర్టర్, సాక్షి


రైతులకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు...‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అనే పేరిట ఉగాది పర్వదినాన విడుదలైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో– 2019లోని ముఖ్యాంశాలు...

ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ. 50 వేలు ∙పంటవేసే సమయానికి మే నెలలోనే ఉచితంగా రూ.12500  ∙పంట బీమా కోసం రైతన్న చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది ∙రైతన్నకు ఉచిత బోర్లు. పగటిపూట ఉచితంగా 9 గంటల కరెంటు ∙ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయిన్నర చార్జీకే కరెంటు ∙రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ∙పంట వేసేముందే.. ఆయా పంటలకు లభించే మద్దతు ధరల ప్రకటన.. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ  ∙రూ.4 వేల కోట ప్రకృతి విపత్తుల సహాయక నిధిని ఏర్పాటు ∙

ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటు ∙మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరణ ∙రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే.. ప్రతిపాడి రైతుకు లీటరుకు 4 రూపాయల బోనస్‌ ∙వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్, టోల్‌ ట్యాక్స్‌ రద్దు ∙ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ. 7 లక్షలు అందజేత 
కౌలు రైతులకు ఇచ్చిన హామీలు...

∙కౌలు రైతులకు పంటపై హక్కు ఉండే విధంగా చర్యలు. 11 నెలలు మించకుండా కౌలు రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్టసవరణ ∙కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు..  ఆ కాల వ్యవధిలో పంటకు సంబంధించిన అన్ని రాయితీలు, సబ్సిడీలు వారికే అందిస్తారు. నవరత్నాల్లో రైతులకు ప్రకటించిన మిగిలిన అన్ని హామీలనూ కౌలు రైతులందరికీ వర్తింపు ∙ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏటా రూ. 12,500


జగన్‌కుజై కొట్టిన రైతులు...
ఒకేరోజు విడుదలైన వైఎస్సార్‌ సీపీ, తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలను సరిపోల్చి చూసుకున్న రైతాంగం జగన్‌కు జై కొట్టింది. చంద్రబాబు గతంలో మాదిరే రూ.5 వేల కోట్ల స్థిరీకరణ నిధి హామీ ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తోంది. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద మొక్కజొన్న, జొన్న, కంది, మిర్చి, మామిడికి ఇస్తామన్న డబ్బే ఇంతవరకు తిరిగి ఇవ్వనప్పుడు మళ్లీ ఈ హామీ ఎందుకని నిలదీస్తోంది. రైతులకు పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తానని వైఎస్సార్‌సీపీ ప్రకటిస్తే ఇప్పుడు చంద్రబాబు 12 గంటలంటున్నాడు.

గతంలో 9 గంటలు ఇస్తానని చెప్పి వేళకాని వేళల్లో 7 గంటలు ఇచ్చి ఇక్కట్లు పాల్జేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని సైతం జగన్‌ ప్రకటించిన తర్వాతే ఆయన కాపీ కొట్టారని నిరసిస్తున్నారు. జగన్‌ ప్రకటించిన వైఎస్సార్‌ రైతు భరోసా ఆచరణ సాధ్యమైందిగా అభివర్ణిస్తున్నారు. జగన్‌ గెలవాలని బాగుంటుందని మొక్కుకుంటున్నారు. జగన్‌కు జేజేలు పలుకుతున్నరైతులుజు పెట్టుబడిసాయం కిందరూ.50 వేలుజుకౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసాజుఉచిత పంటల బీమా 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!