చేపలతో పుట్టబోయే బిడ్డకు ఆస్తమా దూరం!

7 Nov, 2017 00:22 IST|Sakshi

పరిపరిశోధన

మీరిప్పుడు గర్భవతా, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారా?  అయితే మీరు తీసుకునే ఆహారంలో పుష్కలంగా చేపలకూర ఉండేలా చూసుకోండి. గర్భవతులుగా ఉన్నప్పుడు చేపలు ఎక్కువగా తినేవారికి కలిగే సంతానానికి ఆస్తమా వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు పరిశోధకులు. వారి సిఫార్సుల మేరకు గర్భవతులు వారంలో కనీసం 250 గ్రాముల నుంచి 340 గ్రామల వరకు చేపలు తినాలి. వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేపలు తినడం కూడా మంచిదే.

అనేక కీలక సంస్థల్లోని డాక్టర్లు, అధ్యయనవేత్తల పరిశోధనల ఫలితాలను పొందుపరిచిన ‘ద జర్నల్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ క్లినికల్‌ ఇమ్యునాలజీ’ మ్యాగజైన్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం గర్భవతులుగా ఉన్నప్పుడు ఆహారంలో విరివిగా చేపలు తినేవారి పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. అమెరికన్‌ అత్తున్నత ఔషధాల అనుమతి సంస్థ ‘ద ఫుడ్‌ అండ్‌ గ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ కూడా గర్భవతులు చేపలు తినడం మంచిదని సిఫార్సు చేస్తోంది.

మరిన్ని వార్తలు