బంగారు కానుక

17 Apr, 2020 07:39 IST|Sakshi

భార్య, భర్త బెంగుళూరులో ఉంటారు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా భార్యాభర్తలుగానే ఉండిపోయారు. చివరికి పిల్లల కోసం సూరత్‌ వెళ్లారు. ఐవీఎఫ్‌ టెక్నిక్‌తో అద్దెగర్భాన్ని ఆశ్రయించారు. తిరిగి బెంగళూరు వచ్చేశారు. తొమ్మిది నెలలు అయ్యాక మార్చి 29న శుభవార్త అందింది. ‘మీకు పాప పుట్టింది’ అని. ఎగిరి గంతేశారు. ఎగిరిపోతే ఎంత బాగుండు అనుకున్నారు. లాక్‌డౌన్‌! కొన్నాళ్లు వీడియో కాల్స్‌తో తృప్తిపడ్డారు. పాప బంగారు బొమ్మలా ఉంది.

అప్పటికే సూరత్‌లోని ఐవీఎఫ్‌ హాస్పిటల్‌ వాళ్లు ఆ పాపను ‘సన్‌పరి’ (బంగారు కానుక) అని పిలుచుకుంటున్నారు. ఇక్కడ బెంగళూరులో పేరెంట్స్‌ నిలవలేకపోతున్నారు. పాపను రెండు చేతుల్లోకి తీసుకోవాలని ఆశపడుతున్నారు. వాళ్ల తపన చూసి ఆసుపత్రివాళ్లు ఆ పర్మిషన్, ఈ పర్మిషన్‌ సంపాదించి, ఢిల్లీ నుంచి ఎయిర్‌ అబులెన్స్‌ను తెప్పించి, పాపను మొన్న మంగళవారం బెంగళూరు పంపారు. సూర™Œ  ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కిస్తే.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి పాప.. పేరెంట్స్‌ చేతుల్లోకి వెళ్లేసరికి సాయంత్రం 5 అయింది. మొదట.. తండ్రే పాపను చేతుల్లోకి తీసుకున్నాడు.

మరిన్ని వార్తలు