దోమలకు చెక్‌ పెట్టే బ్యాక్టీరియా..

21 Jan, 2019 00:32 IST|Sakshi

ఎన్ని రకాల కాయిల్స్, లిక్విడ్స్‌ వాడినా దోమల బెడద తప్పడం లేదా? మీ సమస్యకు విస్‌కాన్సిన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నారు. మట్టిలో ఉండే ఓ బ్యాక్టీరియా అత్యంత సమర్థంగా దోమలు దూరంగా పారిపోయేలా చేయగల రసాయనాన్ని సృష్టిస్తోందని వీరు గుర్తించారు. ఈ రసాయనం డీడీటీ కంటే చాలా శక్తిమంతమైందని అంచనా. డీడీటీతో దోమల నివారణ జరుగుతున్న కొన్ని ఇతర సమస్యల కారణంగా ఈ రసాయనంపై చాలా దేశాల్లో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన ప్రత్యామ్నాయం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీనోరాబ్డస్‌ బుడపెస్టెనిసిస్‌ అనే బ్యాక్టీరియా కీటకాలను ఎలా చంపగలుగుతోందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనం దోమలు దూరంగా పారిపోయేలా చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తున్న రసాయనం డీడీటీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావశీలి అని కూడా ఈ పరిశోధనల ద్వారా తెలిసింది. అంతేకాకుండా... ఈ రసాయనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దోమలు రక్తం పీల్చకుండా మాత్రమే నిరోధిస్తోందని.. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దోమలు పారిపోయేలా చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆకలి 'చేప'

సామాన్యుల సహాయాలు

అమ్మకు పని పెంచుతున్నామా?

మై సిస్టర్‌

‘‘శాంతా, ఎట్లున్నవ్‌? తింటున్నవా?

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...