మజిల్‌క్రాంప్స్‌ను తగ్గించే అరటిపండు

2 Jan, 2018 00:17 IST|Sakshi

గుడ్‌ఫుడ్‌ 

అతి తేలిగ్గా చవకగా దొరుకుతూ అత్యంత ఎక్కవ పోషకాలు ఉండే పండ్లలో ముఖ్యమైనది అరటిపండు. దానితో ఒనగూరే ప్రయోజనాల్లో అవి కొన్ని... ∙ఒంట్లో ఖనిజ లవణాలు తగ్గి మాటిమాటికీ కండరాలు పట్టేస్తున్నవారు (మజిల్‌ క్రాంప్స్‌తో బాధపడుతున్నవారు) అరటిపండ్లు తింటే ఆ సమస్య దూరవుతుంది ∙అరటిపండులో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అది రక్తపోటు (హైబీపీ)ని స్వాభావికంగానే నియంత్రిస్తుంది ∙ఇందులో ఉండే పొటాషియమ్, విటమిన్‌ సి, విటమిన్‌ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి.

విటమిస్‌ సితో పాటు బి6 అంశాలు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సైతం తోడ్పడతాయి ∙అరటిపండు జీర్ణశక్తిని పెంచి, ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ∙ఇందులోని పొటాషియమ్‌ మన మూత్రపిండాల ఆరోగ్య నిర్వహణకు తోడ్పడుతుంది ∙ఇందులోని అమైనో యాసిడ్స్‌ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి

మరిన్ని వార్తలు