బార్బీకి పోటీగా  ఫియర్‌లెస్‌ గర్ల్‌

15 Mar, 2019 01:53 IST|Sakshi

బార్బీ ప్లేస్‌లోకి ‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’ అనే కొత్త బొమ్మ రాబోతోందా! బార్బీ నాజూకుగా ఉంటుంది. ‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండడం ఇప్పడు ‘కొత్త నాజూకు’ కాబట్టి.. రాబోయే రోజుల్లో ఫియర్‌లెస్‌ గర్ల్‌నే అంతా ఇష్టపడబోతున్నారా? మరేం పర్వాలేదు. పాత బొమ్మ ప్లేస్‌లోకి కొత్త బొమ్మ వచ్చినా కొత్తగా మారబోయేదేం ఉండదు. బార్బీలో ఇన్‌బిల్ట్‌గా ఫియర్‌లెస్‌నెస్‌ ఉంటుంది కనుక రెండు బొమ్మలూ ఒకటే. రెండు బొమ్మలూ ఇచ్చే ఇన్‌స్పిరేషన్‌ ఒక్కటే. చాయిస్‌ మాత్రం మీ అమ్మాయిదే. రెండూ కావాలి అంటే రెండూ కొనివ్వొచ్చు. 


మార్చి 7. మార్చి 8. మార్చి 9.
చరిత్రలో ఈ మూడూ మూడు ముఖ్యమైన రోజులు. మూడూ మూడు మహిళా దినోత్సవాలు. మూడూ ఈ మధ్యనే వచ్చి వెళ్లిపోయాయి. మార్చి ఎనిమిది.. తెలిసిందే. హిస్టారిక్‌ డే. అండ్‌.. హిస్టారికల్‌ డే కూడా. మార్చి ఏడు, మార్చి తొమ్మిది కూడా అలాంటివే. అయితే అవి పెద్దగా సెలబ్రేట్‌ అవలేదు. మార్చి ఏడైతే అసలు వచ్చి వెళ్లినట్లే ఎవరికీ తెలీదు. 

ఏంటి మార్చి 7కు ఉన్న ప్రత్యేకత? 
‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’ పుట్టిన రోజు. అవును. భయమన్నదే లేని పిల్ల బర్త్‌డే ఆ రోజు. ఆరో ఏడో ఏళ్లుంటాయి. పొట్టి గౌన్‌లో ఉంటుంది. కాళ్లకు బూట్లు ఉంటాయి. జుట్టు రబ్బరు బ్యాండుతో ముడివేసి ఉంటుంది. నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడి, తల కాస్త పైకి ఎత్తి చూస్తుంటుంది. సర్దార్‌ పాపారాయుడు (1980) సినిమాలో ఎన్టీఆర్‌లో కనిపించే ‘ఫియర్‌లెస్‌నెస్‌’ లాంటి ఫియర్‌లెస్‌నెస్‌ ఆ గర్ల్‌లో కనిపిస్తుంటుంది.స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తాం మనం. మనలాంటివాడే.. ‘సర్దార్‌ పాపారాయుడు’లో మోహన్‌ బాబు. పాపారాయుడు శక్తిని తక్కువగా అంచనా వేస్తాడు. పాపారాయుణ్ణి ఎంత తేలిగ్గా షూట్‌ చేసి, డెడ్‌బాడీ తేవచ్చో డీటెయిల్డ్‌గా చెప్తాడు. మోహన్‌బాబు బ్రిటిష్‌ దొరబాబు. ఎన్టీఆర్‌ అతడి టార్గెట్‌.‘‘వాణ్ణి కాల్చడం అంత సులభం కాదు సర్‌’ అని ఇండియన్‌ ఏజెంట్‌ ఒకడు అంటే.. ‘‘ఇన్‌సల్ట్‌’’ అని పెద్దగా అరుస్తాడు ఆ ఏజెంట్‌ మీద మోహన్‌బాబు.‘‘ఏమీ.. వాడేమి అల్లూరి సీతారామా రాజా, ఆజాద్‌ చంద్రశేఖరా, భగత్‌సింగా, సుభాస్‌ చంద్రబోసా.. ఆఫ్ట్రాల్‌ పప్పారాయుడు. చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి.

తుపాకీ చేత్తో పట్టుకోండి. వేలు నొక్కండి. గుండు బయటికొస్తుంది. గుండెల్లోనుంచి దూసుకుపోతుంది.   దట్సాల్‌. గిలగిలా తన్నుకు ఛస్తాడు. అండర్‌స్టాండ్‌? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్టావుట్‌’’ అంటాడు. అంతా వెళ్లిపోతారు. మోహన్‌బాబు ఒక్కడే బంగళాలో మిగిలిపోతాడు. అప్పుడొస్తాడు పాపారాయుడు అదే బంగళాలోని పై ఫ్లోర్‌లోంచి.. కిందికి ఒక్కో మెట్టూ దిగుతూ! ఉలిక్కిపడతాడు మోహన్‌బాబు.. ఒక్కో మెట్టూ వెనక్కు దిగుతూ. అంతకు ముందెప్పుడూ పాపారాయుడిని చూసి ఉండడు అతడు. ‘‘హు ఆర్‌ యు.. నీవెవరు? నీ పేరేమి? వాటీజ్‌ యువర్‌ నేమ్‌’’ అంటాడు. చెప్తాడు ఎన్టీఆర్‌. ‘‘ఓహ్‌.. పప్పారాయుడు’’ అని బెదిరిపోతాడు మోహన్‌బాబు. తన స్టెయిల్‌లో నవ్వుతాడు ఎన్టీఆర్‌. ‘‘ఏ! పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? ఊ. తీసుకో. వేలుతో నొక్కు. హె. గుండు బయటికొస్తుంది. గుండెల్లోనుంచి దూసుకుపోతుంది. ఊ.. తీసుకో. తీసుకో’’ అంటాడు ఎన్టీఆర్‌. ‘‘ఎ.. నువ్వెందుకొచ్చావిక్కడికి?’’ అంటాడు.‘‘నువ్వు చచ్చేముందు పాపారావు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని’’ అంటాడు ఎన్టీఆర్‌.‘‘ఓ.. గుడ్‌ పర్సనాలిటీ.

ఓ.. బెస్టాఫ్‌ లక్‌. గో.. గో.. ప్లీజ్‌ గో.. వెళ్లూ..’ అంటాడు.‘‘పిరికిపంద. కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకు రమ్మన్నావ్‌. నీ కళ్ల ముందుకు వచ్చినవాణ్ణి పొమ్మంటున్నావ్‌. ఏ.. భయమా?’’ అంటాడు ఎన్టీఆర్‌.‘‘నీ చెవులు వైర్‌లెస్‌. నీ చూపులు కేర్‌లెస్‌. నీ మాటలు ఫియర్‌లెస్‌’’ అంటాడు మోహన్‌బాబు. పాపారాయుడులోని సేమ్‌ ఆ కేర్‌లెస్‌నెస్, ఫియర్‌లెస్‌నెస్‌ ఈ పాప.. ‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’లో కనిపిస్తుంటాయి. న్యూయార్క్‌లోని ‘బౌలింగ్‌ గ్రీన్‌’ పబ్లిక్‌ పార్క్‌లో అలా నిలబడి ఉంటుంది. పాప ఎదురుగా వాల్‌స్ట్రీట్‌ బుల్‌ (ఎద్దు) ఉంటుంది. ‘చూసుకుందాం రా..’ అని ఆ బుల్‌ని సవాల్‌ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె కాళ్ల దగ్గర చిన్న గుండ్రటి పళ్లెం లాంటి శిలాఫలకం ఉంటుంది. ‘నో ద పవర్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌. షి మేక్స్‌ ఎ డిఫరెన్స్‌’ అని ఆ ఫలకంపై రాసి ఉంటుంది. ‘మహిళా నాయకత్వ శక్తి గురించి తెలుసుకోండి. తన సత్తా ఏమిటో చూపిస్తుంది’.. అని. 50 అంగుళాల పొడవు, 110 కిలోల బరువు ఉన్న ఈ ‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’ కంచు విగ్రహాన్ని ‘స్టేట్‌ స్ట్రీట్‌ గ్లోబల్‌ అడ్వైజర్‌’ (ఎసెస్‌జీఏ) అనే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ తయారు చేయించి అక్కడ పెట్టించింది. ఆస్తుల విలువను అంచనా వెయ్యడంలో ఎసెస్‌జీఏ ఎక్స్‌పర్ట్‌. మహిళలు లీడ్‌ చేసే కంపెనీల ఆస్తుల విలువ త్వరగా, స్థిరంగా పెరగడం ఆ కంపెనీ గమనించింది.

అయితే ఎలా ఆ విషయాన్ని ఇండికేట్‌ చెయ్యడం? మామూలు విలువను గ్రాఫ్‌లో చూపించవచ్చు. మరి మహిళా శక్తిని? స్టాచ్యూలో చూపించారు. ఆ స్టాచ్యూనే ‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’. 2017 మార్చి 7న స్టాచ్యూని ప్రతిష్టించారు. వందేళ్ల నాటి మహిళా పోరాటాల్లోంచి వచ్చిన మార్చి 8 ఎక్కడ? రెండేళ్ల క్రితమే పుట్టిన ఈ ఫియర్‌లెస్‌ పాపాయి ఎక్కడ? ఆ ప్రశ్నే అక్కర్లేదు. మార్చి ఎనిమిది అనే రోజును విగ్రహంలా చెక్కితే.. ‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’ రూపమే వస్తుంది. మహిళలు నిర్భయంగా చేసిన పోరాటాలు, లేవదీసిన ఉద్యమాలు, నడిపించిన విప్లవాలు.. వీటన్నిటికీ సరిగ్గా సరిపోయే సింబాలిక్‌ వర్చ్యూ, స్టాచ్యూ.. ఫియర్‌లెస్‌ గర్ల్‌. ఇప్పుడీ గర్ల్‌ పవర్‌ ఎలా విస్తరించబోతోందో చూడండి. ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో బార్బీడాల్‌ ప్లేస్‌లోకి ఫియర్‌లెస్‌ గర్ల్‌ డాల్స్‌ రాబోతున్నాయి. అయితే డాల్స్‌లా కాదు. చిట్టిపొట్టి స్టాచ్యూల్లా! కోర్టులో కేసు నడుస్తోంది. అది క్లియర్‌ అయితే హైదరాబాద్‌కి, ఆంధ్రా కేపిటల్‌కీ వచ్చేస్తుంది ఫియర్‌లెస్‌ గర్ల్‌. మనమూ ఒకటి కొనొచ్చు. మన అమ్మాయి బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఫియర్‌లెస్‌ గర్ల్‌ స్టాచ్యూని చేయించింది ఎసెస్‌జీఏ అయితే, చేసింది క్రిస్టన్‌ విస్బెల్‌ అనే అమెరికన్‌ మహిళ. ఫియర్‌లెస్‌ గర్ల్‌ నమూనాలను ఇప్పటికే ఆమె ఇద్దరు ముగ్గురికి కానుకగా ఇచ్చారు. అయితే ‘మీకా హక్కులేదు’ లేదని ఎసెస్‌జీఎ కేసు వేసింది.

‘ఫియర్‌లెస్‌సెన్‌ మనిషి జన్మహక్కు. ఎవరి దగ్గరైనా ఆ స్టాచ్యూ ఉండొచ్చు’ అని విస్బెల్‌ వాదన. అయితే మనిషి జన్మహక్కు కాదు. స్త్రీ జన్మహక్కు. మరి మగవాడికి? స్త్రీని భయపెట్టడం తన జన్మహక్కు అనుకుంటుంది కదా పురుష ప్రపంచం? ఆ ప్రపంచాన్ని హద్దుల్లో ఉంచడానికే ఫియర్‌లెస్‌ గర్ల్‌ స్టాచ్యూ. మార్చి 8 ఉమెన్స్‌ డే. మార్చి 7 ఫియర్‌లెస్‌ గర్ల్‌ బర్త్‌ డే. మరి మార్చి 9? బార్బీడాల్‌ పుట్టినరోజు. బార్బీకి అరవై ఏళ్లొచ్చాయి మొన్న తొమ్మిదికి. మొదట్లో బార్బీ వట్టి మమ్మీ డాల్‌. మన చిన్నప్పుడు ఆడపిల్లలు ఆడుకునేవాళ్లు కదా.. చిన్న పాపాయిని చంకలో ఎత్తుకుని ఉన్న చిన్నారి బొమ్మతో. అలాంటి బొమ్మ.. బార్బీ డాల్‌. అయితే ఇండిపెండెంట్‌ బొమ్మ. చేతిలో పాపాయి ఉండదు. అలాగని తను పాపాయీ కాదు. ఉమన్‌. ఆ ఉమన్‌ అరవై ఏళ్లుగా ఆడపిల్లల చేతిలో పాపాయి అయింది. ఫస్ట్‌ ఫస్ట్‌ బార్బీ క్యూట్‌ ఉమన్, స్వీట్‌ ఉమన్, స్విమ్‌ సూట్‌ ఉమన్‌. స్త్రీని ఇలాగేనా చూపించడం అని మధ్యలో ఎవరో క్వశ్చన్‌ చేశారు. పాయింటే. వెంటనే ఫ్యాషన్‌ మోడల్‌గా ఉన్న బార్బీ రోల్‌ మోడల్‌ అయింది. సెలబ్రిటీ అయింది. ఆస్ట్రోనాట్‌ అయింది. సి.ఇ.వో. అయింది. జర్నలిస్ట్‌ అయింది. ఇంజినీర్‌ అయింది. ఎయర్‌హోస్టెస్‌ అయింది. లోకంలో ఎన్ని టఫ్‌ ప్రొఫెషన్స్‌ ఉంటాయో అన్నీ అయింది. ఆఖరికి అమెరికన్‌ ప్రెసిడెంట్‌ కూడా.

అంతేనా, పవర్‌ఫుల్‌ గర్ల్‌గా టైమ్‌ మేగజీన్‌ కవర్‌ పేజీ కూడా అయింది! సాదాసీదాగా ఉన్న బార్బీనీ, స్ట్రాంగ్‌ బార్బీని చెయ్యడానికి చాలానే ఉద్యమాలు నడిచాయి. ‘‘బార్బీని నెలువెత్తు బొమ్మగా ‘స్కేల్‌ అప్‌’ చేసి చూస్తే 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉంటుంది. 55–60 కేజీల మధ్య బరువు ఉంటుంది. 36–18–33 ఆకృతిలో ఉంటుంది. లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఉండే ఇలాంటి బాడీ షేప్, ఎత్తుకు సరిపడా లేని బార్బీ బరువు.. ఆడపిల్లల మనసు పాడుచేసి, వారిని ‘బార్బీ సిండ్రోమ్‌’కు గురిచేస్తోందని జూలీ బిండెల్‌ అనే స్త్రీవాద రచయిత్రి పదేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ భూమ్మీద బార్బీ ఉన్నంత కాలం ఆడపిల్లలకు మనశ్శాంతి ఉండదు’’ అని యాగ్నెస్‌ నైర్న్‌ అనే విద్యావేత్త కలవరపడ్డారు. వాళ్ల ఒపీనియన్‌కి గౌరవం లభించింది. బార్బీ ఇప్పుడు అందమైన పిల్లే కాదు. స్ట్రాంగ్‌ గర్ల్‌ కూడా.

మరేమిటి? బార్బీ ప్లేస్‌లో ఫియర్‌లెస్‌ గర్ల్‌ వచ్చేస్తుందా? ఇంకో రెండు మూడేళ్లలో వచ్చేస్తుందనే అంటున్నారు. వచ్చినా, రాకున్నా.. ప్రతి బార్బీలోనూ ఇన్‌బిల్ట్‌గా ఓ ఫియర్‌లెస్‌ గర్ల్‌ ఉంటుంది. అందుకే కదా.. కదా ప్రపంచాన్ని అరవై ఏళ్లుగా శాసిస్తూ వస్తోంది. ఫియర్‌లెస్‌ గర్ల్‌కి ఉన్నట్లే బార్బీ డాల్‌ కీ ఒక జన్మ వృత్తాతం ఉంది. బార్బీని సృష్టించింది రూత్‌హ్యాండ్లర్‌ అనే మహిళ. అమెకో కొడుకు. కూతురు. కొడుక్కి ఆడుకోడానికి చాలా బొమ్మలు ఉండేవి. కార్లు, ఏరోప్లేన్‌లు, గన్‌లు. కూతురికి ఒకే బొమ్మ ఉండేది. కేరింగ్‌ డాల్‌. పాపాయిని ఎత్తుకున్న పాపాయి బొమ్మ. ‘కేరింగ్‌ గానే కాదు, డేరింగ్‌గానూ ఉండాలి నా కూతురు’ అనుకున్నారు రూత్‌. తనే స్వయంగా కూతురి కోసం బార్బీ డాల్‌ని తయారు చేశారు. ఆమె కూతురి పేరు బార్బారా. ఆ పేరే బొమ్మకు పెట్టారు బార్బీ అని. 

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’