పాపాయికి చెవులు కుట్టిస్తున్నారా?

14 Sep, 2019 00:40 IST|Sakshi

బీ కేర్‌ఫుల్‌

ఆడపిల్లలైతే వారు ఓ ఏడాది వయసుకు చేరగానే చెవులు కుట్టించడం మన సంప్రదాయం. దీనికి మతాలూ, కులాలన్న తేడా లేదు. అలాగే కాస్తంత పెద్ద వయసు రాగానే అమ్మాయిలు ముక్కు కూడా కుట్టించుకుంటున్నారు. ఇటీవల అయితే కేవలం చెవి తమ్మెకు ఒక చోట మాత్రమే కాకుండా... ఇంకా రెండు మూడు రంధ్రాలు కూడా పెట్టి ఆభరణాలు ధరిస్తున్నారు. ఇలా చెవులు కుట్టించుకోవడంలో కాస్తంత సంప్రదాయంతో పాటు... బోల్డంత కాస్మటిక్‌ ప్రయోజనాలు కూడా చూస్తున్నారు ఈకాలం మహిళలు. గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారు లేదా వెండి వైర్స్‌తో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు.

ఇప్పుడు బ్యూటీ సెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు.  ఇప్పుడు అధునాతన పియర్సింగ్‌ గన్స్‌తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచుకున్న బంగారు, వెండి తీగలను ముందుగా స్టెరిలైజ్‌ చేసి ఈ పని చేస్తున్నారు. ఇలా చెవి, ముక్కు లేదా స్టడ్‌ వేయాల్సిన ఇతర ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్‌ రావచ్చు. ఆ అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుట్టించిన ముక్కు, చెవులు మరింత అందంగా, ఆకర్షణీయంగా  ఉండటంతో పాటు అవి ఆరోగ్యంగా కూడా ఉంటాయి.

చెవులు ముక్కు కుట్టించడంలో సహజంగా తలెత్తే సమస్యలు
ఇన్ఫెక్షన్స్‌ : కుట్టాల్సిన చోట సెప్టిక్‌ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్‌ రావచ్చు.

 సిస్ట్‌ / గ్రాన్యులోమా ఏర్పడటం: ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్‌ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్‌ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం  కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి.

మచ్చ ఏర్పడటం : కొన్నిసార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్‌ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్‌ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
►చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది.  

►మన శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్‌ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ లేకుండా ఉన్నప్పుడే మీరు ఈ కుట్టించుకోవడం చేయండి.

►చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోండి.

►సాధారణంగా బంగారు, వెండి వైర్లతో కుట్టే సమయంలో అది చాలావరకు ఎలాంటి హానీ చేయదు. కానీ..  ముందుగానే ఆ వైర్లను స్టెరిలైజ్‌డ్‌ సొల్యూషన్‌లో శుభ్రపరచుకుని ఉండటం ఎందుకైనా మంచిది.

►చిన్న పోటుతో నొప్పిలేకుండానే కుట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరీ నొప్పిగా ఉంటే తప్ప... సాధ్యమైనంత వరకు అనస్థీషియా ఉపయోగించకూడదు. మీరు ఒకేసారి రెండుచోట్ల రంధ్రాలు వేయించడం వంటివి చేస్తున్నప్పుడు మాత్రం లోకల్‌ అనస్థీషియా క్రీమ్‌ పూయడం మంచిది.

►తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడం మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డాక్టర్‌ సలహా తీసుకోవడం అవసరం.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోదీ కాలింగ్‌ ఈజ్‌ దట్‌ సిస్టర్‌ ఛాయ?

నిజమైన హీరోలు కావాలి

తొలి గెలుపు

అద్దె మాఫీ

నాట్యప్రియ

సినిమా

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు