ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లతో జాగ్రత్త

10 Jun, 2016 23:01 IST|Sakshi
ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లతో జాగ్రత్త

పరిపరిశోధన

 

ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లు గుండెపోటుకు కారణం కావచ్చని అధ్యయనవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆటలను టీవీలలోనూ, నేరుగానూ చూసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో నిర్వహించిన ఒక సదస్సులో బ్రిటిష్ కార్డియోవాస్క్యులార్ సొసైటీకి చెందిన నిపుణులు ఈ విషయంపై మాట్లాడారు.


ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంతే ఉద్వేగంతో దాన్ని చూస్తున్న వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అసోసియేట్ మెడికల్ డెరైక్టర్ ప్రొఫెసర్ జెరెమీ పియర్సన్ పేర్కొన్నారు. అయితే ఇది సాకుగా చూపించి, కేవలం ఇలా పోటీలను చూడటం మానేస్తే సరిపోదనీ, గుండెకు ఒత్తిడి కలగని విధంగా వ్యాయామాలు తప్పనిసరిగా చేయాల్సిందేనని ఆయన సూచించారు.

 

 

మరిన్ని వార్తలు