చల్లగా... కాంతిగా...

19 Mar, 2015 22:45 IST|Sakshi
చల్లగా... కాంతిగా...

అందం
 
ఎండ వల్ల చర్మం పొడి బారుతుంది. కమిలిపోయినట్లవుతుంది. ఈ సమస్యలకు
 
విరుగుడుగా...

 
సగం దోసకాయను మెత్తగా రుబ్బి, అందులో టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి, పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.
 
దోస రసం, పుచ్చకాయ రసం సమపాళ్లలో కలిపి ముఖానికి, మెడకు రాసి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. బొప్పాయి గుజ్జు, నిమ్మరసం కలిపి ముఖానికి రాసి, పది నిమిసాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ కాంతి కూడా పెరుగుతుంది.
 

మరిన్ని వార్తలు