గులాబీలాంటి అందం

3 Mar, 2015 23:10 IST|Sakshi
గులాబీలాంటి అందం

అందమె ఆనందం

వాతావరణం మారుతున్నప్పుడు ఆ ప్రభావం చర్మం మీద ప్రధానంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ముందుగా పెదవులు తడారిపోవడం, చర్మంపై మృతకణాలు తేలడం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఇలాంటప్పుడు... పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. పది-పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. రాత్రి పడుకునేముందు గులాబీల పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. తరచూ ఈ విధంగా చే స్తే పెదవులకు గులాబీల అందం వస్తుంది.
 
టేబుల్ స్పూన్ అల్లం తరుగు, స్పూన్ కొత్తిమీర, స్పూన్ లెమన్ జిస్ట్ (నిమ్మకాయ పై తొక్కను తురిమినది), రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, గుప్పెడు గులాబీల రేకలు తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ మస్లిన్ క్లాత్‌లో వేసి గట్టిగా ముడివేయాలి. ఈ మూటను వేడినీళ్లలో వేసి, ఆ నీటిని స్నానానికి ఉపయోగించాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. సువాసన తాజాదనం అనుభూతిని ఇస్తుంది. చర్మం పొడిబారడం తగ్గుతుంది.

 

>
మరిన్ని వార్తలు