బ్యూటిప్‌

9 Feb, 2018 02:48 IST|Sakshi

ఒక టీ స్పూన్‌ మీగడలో అంతే మోతాదులో నిమ్మరసం కలిపితే హోమ్‌మేడ్‌ క్లెన్సింగ్‌ క్రీమ్‌ రెడీ. దీనిని ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో కాని గోరువెచ్చటి నీటితో కాని శుభ్రం చేయాలి. ఇది చర్మానికి టోనర్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని తెల్లబరుస్తుంది కూడా. రోజుకు ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి చప్పరిస్తే క్రమంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. 

టేబుల్‌ స్పూను శనగపిండి, ఒకటిన్నర టీ స్పూన్ల నీళ్లు, చెంచాడు తేనె కలిపి ముఖానికి రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది.   నిమ్మరసంలో రెండు టేబుల్‌ స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖం నిగనిగలాడుతుంది. 

మరిన్ని వార్తలు