నాన్‌స్టిక్‌ ఫేస్‌

11 May, 2018 00:15 IST|Sakshi

సమ్మర్‌ కేర్‌

జిడ్డు చర్మం గలవారికి వేసవి మరింత పరీక్ష పెడుతుంది. చమట అధికమై బయటి దుమ్ము, ధూళి చేరి చర్మం కాంతివిహీనం అవుతుంది.  ఈ సమస్య నివారణకు...

ఫేసియల్‌ బ్లీచ్‌
4 టేబుల్‌స్పూన్ల పాలు, టేబుల్‌ స్పూన్‌ తేనె, 2 టేబుల్‌స్పూన్ల నిమ్మరసం కలిపి చర్మం కమిలి నల్లబడిన చోట రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. 

పెరుగుతో క్లెన్సర్‌
4 టేబుల్‌ స్పూన్ల పెరుగు, 2 టేబుల్‌ స్పూన్ల తేనె, 3 టేబుల్‌ సూన్ల నిమ్మరసం వేసి చిక్కగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 2–3 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. 

వేపతో నివారణ
వేప ఆకులు ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చందనం, ముల్తానీమిట్టి, తేనె, నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి, ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. 

నారింజ రసం
టీ స్పూన్‌ నారింజ రసం, 3 టీస్పూన్ల ఓట్స్, టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ గుడ్డులోని తెల్లసొన లేదా పెరుగు కలిపి ముఖానికి పట్టించి, వలయకారంగా 5 నిమిషాల సేపు స్క్రబ్‌ చేయాలి. తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి.

బియ్యప్పిండి
మూడు టీ స్పూన్ల బియ్యపిండి, చిటికెడు పసుపు, టీ స్పూన్‌ తేనె, దోస రసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ముఖాన్ని పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. మేనికి కూడా ఇది మేలైన ప్యాక్‌. 

మరిన్ని వార్తలు