బ్యూ టిప్స్‌

26 Oct, 2018 01:38 IST|Sakshi

మొటిమలు

మొటిమలు రావడానికి తలలో చుండ్రు ప్రధాన కారణం. తలలో చుండ్రు ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, యాంటీ డాండ్రఫ్‌ షాంపూ వాడాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి ఆ నీటితో తలను శుభ్రపరుచుకోవాలి. ముఖం మీద జిడ్డు లేకుండా జాగ్రత్తపడాలి. అప్పటికీ మొటిమల సమస్య వదలకపోతే చిరోంజి పప్పును పొడి చేసి, పచ్చిపాలలో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తుంటే మొటిమలు, నల్లమచ్చలు తగ్గి, ముఖం ఫెయిర్‌గా అవుతుంది.

ట్యాన్‌
స్నానం చేయడానికి అరగంట ముందు కమలాపండు తొక్కను గుజ్జులా చేసి, కొద్దిగా పాలు కలిపి మేనికి పట్టించి, స్క్రబ్‌ చేయాలి. ఇవి ట్యాన్‌ని పోగొట్టడమే కాకుండా, చర్మాన్ని కాంతిమంతంగా చేస్తాయి.

మరిన్ని వార్తలు