ఎండాకాలం... కురులు కులాసాగా...

14 May, 2019 00:00 IST|Sakshi

బ్యూటిప్స్‌

ఈ కాలం శిరోజాలూ చమట, జిడ్డు కారణాలతో త్వరగా మురికి అవుతాయి. పొడిబారి చిట్లుతుంటాయి. ఈ సమస్యకు విరుగుడుగా ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కురుల నిగనిగలను కాపాడుకోవచ్చు. 

∙రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె, అర టీæ స్పూన్‌ బియ్యం, టీ స్పూన్‌ మిరియాలు. ఈ మూడింటిని కలిపి బియ్యం ముదురు గోధుమరంగులోకి వచ్చేవరకు మరిగించి, దించి, చల్లారనివ్వాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను వేడి చేసి, తలకు మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా అవడమే కాకుండా, రాలడం సమస్య తగ్గుతుంది. 

∙వారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్‌ చేసుకోవడం, నెలకు ఒకసారి హెన్నా ప్యాక్‌ వాడితే కురుల అందం పాడవదు.

∙వేడిమి వల్ల రోజూ తలస్నానం చేస్తుంటారు. దీంతో మాడు పై చర్మం పొడిబారి వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రాత్రి సమయాల్లో ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలంగా ఉంటాయి.  

>
మరిన్ని వార్తలు