బ్యూటిప్స్

30 Aug, 2015 00:20 IST|Sakshi
బ్యూటిప్స్

- విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. మరి అవి బాహ్య సౌందర్యానికి ఎంత తోడ్పడతాయో చాలామందికి తెలీదు. మరి అలాంటి విటమిన్ల కోసం క్యారెట్ తురుములో కొన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మెడ, చేతులకు రాసుకొని 10 నిమిషాలు మర్దన చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి విటమిన్లు సమృద్ధిగా అంది నిగనిగలాడుతాయి.
- ఇంట్లో వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు వాటి పొట్టును పడేస్తూ ఉంటాం. అలా చేయకుండా ఇప్పటి నుంచి ఆ పొట్టుతో ముఖకాంతిని పెంచుకోండి. ఆ పొట్టుకు కొద్దిగా పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్‌ను రాత్రి నిద్రపోయేముందు ముఖానికి రాసుకోవాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడుక్కుంటే ముఖంపై ఉండే మొటిమలు తగ్గడంతో పాటు చర్మకాంతి పెరుగుతుంది.

మరిన్ని వార్తలు