దోసతో దోసెడు అందాలు

21 Oct, 2015 22:54 IST|Sakshi
దోసతో దోసెడు అందాలు

బ్యూటిప్స్

చర్మసౌందర్యాన్ని కాపాడటంలో కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. ఎండకు కమిలిపోయిన ముఖానికి కళాకాంతులు తిరిగి రావాలంటే, కీరదోస గుజ్జులో కాస్త నిమ్మరసాన్ని, రోజ్‌వాటర్‌ను కలిపి ముఖానికి పట్టించండి. అరగంట సేపు ఆరనిచ్చాక చల్లని నీటితో కడిగేయండి. ఇలా తరచు చేస్తుంటే, ముఖం మెరిసిపోతుంది. సున్నిపిండిలో ఎండిన వేపాకు పొడి కలిపి, దానిని కీరదోస గుజ్జులో కలిపి ముద్దగా చేసి పెట్టుకోండి. ఈ ముద్దను ఒంటికి నలుగు పెట్టుకోవడానికి ఉపయోగిస్తే, చర్మం నునుపుదేరుతుంది.
     
ముఖంపై చర్మం తరచు పొడిబారుతుంటే, కీరదోస గుజ్జులో కాస్త పెరుగు, శనగపిండి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట సేపు ఆరనిచ్చాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ముఖానికి కాంతి వస్తుంది.ముఖం జిడ్డుగా మారుతుంటే... కీరదోసను చక్రాల్లా తరిగి, వాటిపై కాస్త ఉప్పు చల్లండి. ఉప్పుచల్లిన కీరదోస చక్రాలతో ముఖం రుద్దుకుంటే, ముఖంపై పేరుకున్న జిడ్డు క్షణాల్లో మాయమవుతుంది. జిడ్డు తగ్గినట్లు అనిపించగానే, ముఖాన్ని చన్నీటితో కడిగేసుకోండి.ముఖంపై ముడతలు మొదలవుతుంటే... ముల్తానీమట్టిలో కీరదోస గుజ్జును, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించండి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
 
 

మరిన్ని వార్తలు