గోధుమ పిండి.. పెసరపిండి...

30 Dec, 2015 19:13 IST|Sakshi
గోధుమ పిండి.. పెసరపిండి...

 బ్యూటిప్స్

రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం లేని ముఖ చర్మం కళకళలాడుతుంది.టీ స్పూన్ పెసరపిండి, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా అవుతుంది.
     
ఉప్పు లేని బటర్ టేబుల్ స్పూన్, స్ట్రాబెర్రీ ఒకటి, చిన్నముక్క కీరా, టీ స్పూన్ నిమ్మరసం, గుడ్డులోని పచ్చసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
 

 

మరిన్ని వార్తలు