బ్యూటిప్స్

6 Jul, 2016 23:23 IST|Sakshi
బ్యూటిప్స్

నీళ్లు తాగితేనే నిగారింపు...
 
వర్షాకాలంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. రకరకాల చర్మసమస్యలు వస్తుంటాయి. ఉదరకోశ సమస్యలు, టైఫాయిడ్ వంటి రోగాలు, జలుబు, దగ్గు, ఆస్తమా వంటివి చర్మంపై ప్రభావం చూపుతాయి. మొటిమలు పెరుగుతాయి. ఈ కాలం ఆరోగ్యాన్నీ, తద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కష్టమే అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ పరిస్థితిని అదుపులో ఉంచవచ్చు.

పొడి చర్మం
వర్షాకాలంలో చల్లదనానికి పదే పదే మూత్రవిసర్జన సమస్యలుంటాయని చాలామంది నీళ్లను తాగడం తగ్గించేస్తారు.. కానీ, రోజులో కనీసం 10-12 గ్లాసుల నీళ్లు తాగితేనే శరీరంలో చేరిన విషపదార్థాలు విడుదలైపోతాయి, చర్మం నిగారిస్తుంది. ఆల్కహాల్ బేస్డ్ లోషన్లు, టోనర్స్ వాడకం తగ్గించడం మేలు. ఆల్కహాల్ వల్ల ఆ లోషన్లు సువాసనగా ఉంటాయి. కానీ, చర్మాన్ని త్వరగా పొడిబారేలా చేస్తాయి.
 

జిడ్డు చర్మం: జిడ్డు పోవడానికి రోజుకు 3-4 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే కాళ్లు, చేతులు కూడా! ముృతకణాలను తొలగించడానికి నేచురల్ ఫేసియల్ స్ట్క్రబ్స్‌ను వాడచ్చు.  శనగపిండి, పాలు, తేనె వంటివి స్నానం చేయడానికి ఉపయోగించడం వల్ల చర్మం మెరుపు పెరుగుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి పదే పదే సబ్బుల వాడకం కన్నా చల్లని నీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లను ఉపయోగిచడం వల్ల చర్మం నునుపు తగ్గదు.
 
 

మరిన్ని వార్తలు