బ్యూటిప్స్

19 Jul, 2016 23:27 IST|Sakshi
బ్యూటిప్స్

గుప్పెడు వేపాకులను మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో మూడు చెంచాల పసుపు వేసి కలిపి, పాదాలకు పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఓ ప్యాకెట్ షాంపూ, నాలుగు చెంచాల ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇందులో పాదాలను పావుగంట పాటు నానబెట్టి, తర్వాత శుభ్రంగా తుడిచేసుకోవాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే పాదాలు పగలకుండా ఉంటాయి.
     
చెంచాడు నిమ్మరసంలో, కొద్దిగా పెట్రోలియం జెల్లీ కలిపి పాదాల పగుళ్లకు పూయాలి. రాత్రంతా పాదాలను అలా ఉంచుకుని, ఉదయం కడిగేసుకోవాలి. వారం పది రోజుల పాటు ఇలా చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది.కీరదోసను, బంగాళదుంపను కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు ప్యాక్‌లా వేసుకోవాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే పగుళ్లు తగ్గుతాయి.  రెండు మూడు చెంచాల బియ్యాన్ని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇందులో కాసింత తేనె, వెనిగర్ వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమం పగుళ్లను మాన్పి పాదాలను స్మూత్‌గా చేస్తుంది.అరటిపండుని మెత్తని గుజ్జులా చేసి, అందులో కాస్తంత తేనె, రోజ్‌వాటర్ కలిపి పగుళ్లు ఉన్నచోట తరచూ పూస్తే... పగుళ్లు, వాటి వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
 

>
మరిన్ని వార్తలు