నిగనిగలాడే కురుల కోసం

3 Oct, 2016 23:10 IST|Sakshi
నిగనిగలాడే కురుల కోసం

 బ్యూటిప్స్

సౌందర్య పోషణలో అతివల జుట్టుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మన జుట్టుని చూసి చెప్పవచ్చు. ఒత్తయిన నిగనిగలాడే జుట్టు ఆరోగ్యానికి సంకేతం. వాతావరణ కాలుష్యం వల్ల, సరైన పోషణ లేక  జుట్టు పొడిబారిపోయి రాలుతుంది. ఈ చిట్కాలతో దీన్ని అరికట్టి మెరిసే జుట్టు మీ సొంతం చేసుకోండి ఇలా...

      
ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి కుదుళ్ల నుండి పట్టించాలి. 20 నిమిషాల తరవాత తల స్నానం చెయ్యాలి.  ఒక కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కప్పు  కరివేపాకుల్ని వేసి  రాత్రంతా నానబెట్టాలి.  మరుసటి రోజు  ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి. కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి. ఆ తరువాత  దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి.  చల్లారిన తరువాత  నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, అర కప్పు నిమ్మరసం తీసుకుని హెన్నా పౌడర్‌లో వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. తయారయిన పేస్ట్‌ని మాడుకు, కేశాలకు పట్టించి అరగంటపాటు ఉంచుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని వార్తలు