తులసి ఫేస్ ప్యాక్

16 Oct, 2016 00:02 IST|Sakshi
తులసి ఫేస్ ప్యాక్

 బ్యూటిప్స్

 
గుప్పెడు తులసి ఆకులు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. తులసి ఆకులు లేకపోతే తులసి పౌడర్‌నైనా నీటిలో కలుపుకుని పేస్ట్ చేసుకోవచ్చు. పౌడర్ మార్కెట్‌లో లభిస్తుంది. తులసి ఆకుల పేస్ట్ రెండు టీ స్పూన్లు, ఓట్‌మీల్ పౌడర్ రెండు టీ స్పూన్లు, రెండు టీ స్పూన్ల పాలు, కొద్దిగా నీళ్ళు తీసుకుని అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.

 
ముందుగా ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్‌ను ముఖమంతా అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్ వేసుకున్న వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. ఈ ప్యాక్‌ను నెలకు రెండుసార్లు వేసుకుంటే మొటిమలు రావడం తగ్గుతుంది. చర్మం రంగు కూడా మెరుగవుతుంది. సెన్సిటివ్ స్కిన్‌వాళ్ళు ఈ ప్యాక్‌ను ముందుగా చేతిపై వేసుకుని మంట, దురద లేకపోతే ముఖానికి వేసుకోవచ్చు.

 
కోకోనట్ మాస్క్:
టేబుల్ స్పూన్ కొబ్బరినూనె ముఖానికి పట్టించి, వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. టవల్ తీసుకుని వేడి నీటిలో ముంచి ముఖం పై అద్దాలి. ఇలా అయిదారు సార్లు చేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. చివరగా రోజ్ వాటర్‌ని అప్లై చేయాలి. ఇలా వారంలో రెండు సార్లయినా క్రమం తప్పకుండా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

మరిన్ని వార్తలు