తేనెతో ముడతల నివారణ...

31 Oct, 2016 23:09 IST|Sakshi
తేనెతో ముడతల నివారణ...

బ్యూటిప్స్


టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాల మీగడ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా 30 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టేబుల్ స్పూన్ టొమాటో గుజ్జులో టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా అప్లై చేసుకుంటే మేనిఛాయ మెరుగవుతుంది.

 పుదీనా ఆకులు మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజులపాటు చేస్తే మంచిఫలితం ఉంటుంది.టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్, టీ స్పూన్ తేనె తగినన్ని పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి మృదువుగా మర్దన చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.

మరిన్ని వార్తలు