నవనవలాడే చర్మానికి... నైట్ టైమ్ లోషన్

5 Nov, 2016 23:06 IST|Sakshi
నవనవలాడే చర్మానికి... నైట్ టైమ్ లోషన్

బ్యూటిప్స్

పగటి పూట కంటే రాత్రివేళలో తీసుకునే జాగ్రత్తలే చర్మాన్ని మరింత ఆరోగ్యవంతం చేస్తాయి. ఇందుకు ఇంట్లోనే నైట్‌క్రీమ్‌ను తయారుచేసుకుని ఉపయోగించవచ్చు.ఒక గిన్నెలో బాదం నూనె, బీస్ వ్యాక్స్, కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. సువాసన రావడానికి ఒక్క చుక్క రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని బాటిల్‌లో పోసుకుని, ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

రాత్రిపూట, మేకప్ తీసేసిన తర్వాత ఈ లోషన్‌ని కొద్దిగా వేణ్ణీళ్లతో తీసుకుని ముఖానికి సున్నితంగా మసాజ్ చేసినట్టుగా రాసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్‌తో లోషన్‌ను పూర్తిగా తుడిచేయాలి. అలాగే చేతులకూ, పాదాలకూ రాసుకుని వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మం పొడిబారదు. నవనవలాడుతూ కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు