బ్యూటిప్స్‌

19 Dec, 2016 23:32 IST|Sakshi
బ్యూటిప్స్‌

ఓట్స్‌ని ఉడికించి, మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చెమట వల్ల పట్టిన మురికి తొలగిపోయి, ముఖం కాంతిమంతమవుతుంది.

పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.

గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

సాయంత్రం ఇంటికి రాగానే నేరుగా సబ్బుతో ముఖాన్ని శుభ్రపరచకుండా ముందుగా క్లెన్సింగ్‌ మిల్క్‌ను తగినంత దూది ఉండకు అద్దుకొని, ముఖాన్ని, మెడను తుడుచుకోవాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై చేరిన మలినాలు, దుమ్ము త్వరగా తొలగిపోతాయి.
జిడ్డుచర్మం అయితే... స్వచ్ఛమైన పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, మోచేతులకు పట్టించాలి. నిమ్మరసం సహజమైన బ్లీచ్‌గా పని చేస్తుంది. ఈ ప్యాక్‌ వేసినప్పుడు కొంచెం మంటగా ఉంటుంది.

ఒక కప్పు బీట్‌రూట్‌ రసంలో అరకప్పు పెరుగు, పావుకప్పు బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. నెలకు రెండుసార్లయినా ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
 

మరిన్ని వార్తలు