బ్యూటిప్స్‌

27 Dec, 2016 23:50 IST|Sakshi
బ్యూటిప్స్‌

పెదవులు పొడిబారి ఇరఇరలాడుతుంటే... రెండు చెంచాల వెన్నలో, ఒక చెంచా తేనె కలిపి, ఆ మిశ్రమంతో పెదవుల మీద మృదువుగా మర్దనా చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే... పెదవుల్లో తేమ పెరుగుతుంది.

పచ్చి పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది సహజసిద్ధ్దమైన బ్లీచ్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది.

కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి అందులో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే ముఖంమీద మచ్చలు పోతాయి.

పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.

గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
 

మరిన్ని వార్తలు