బ్యూటిప్స్‌

2 Mar, 2017 22:58 IST|Sakshi
బ్యూటిప్స్‌

నునుపైన మెడ కోసం
బంగాళదుంప – 1, పచ్చి పాలు – పావు కప్పు కొబ్బరి నూనె – టీ స్పూన్‌ బంగాళదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్‌లా కలపాలి. శుభ్రపరచుకున్న మెడ పై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా నెల రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే మెడ మీద పేరుకుపోయిన నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది.

మొటిమల నివారణకు...
కొద్దిగా తేనె తీసుకుని దానిలో శనగపిండి కలుపుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మొటిమలపై అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.  తులసి ఆకులు మెత్తగా గ్రైండ్‌ చేసుకుని పేస్ట్‌ చేసుకోవాలి. పేస్ట్‌లో కొద్దిగా నీటిని కలిపి యాక్నే ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని వార్తలు