పాదాల జాగ్రత్త కోసం...

14 Mar, 2017 23:13 IST|Sakshi
పాదాల జాగ్రత్త కోసం...

బ్యూటిప్స్‌

నిమ్మరసం – కప్పు, దాల్చిన చెక్క పొడి – పావు టీ స్పూన్, ఆలివ్‌ ఆయిల్‌ – రెండు టీ స్పూన్లు, గోరువెచ్చని నీళ్లు – పాదాలకి సరిపడా. ఇవన్నీ టబ్‌లో కలిపి 20 నిమిషాల సేపు పాదాలను టబ్‌లో ఉంచాలి. టబ్‌లోంచి పాదాలను బయటికి తీశాక, మైల్డ్‌ సోప్‌తో పాదాలు శుభ్రంగా కడిగి టవల్‌తో  లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి.

ఈ విధంగా 15 రోజులకి ఒకసారి చేస్తే పాదాలు తమలపాకుల్లా మృదువుగా ఉంటాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వైట్‌ పెట్రోలియమ్‌జెల్లీ పాదాలకి అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో పది నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి.
 

మరిన్ని వార్తలు