బ్యూటిప్స్‌

18 May, 2017 23:42 IST|Sakshi
బ్యూటిప్స్‌

ఒక టేబుల్‌ స్పూను పైనాపిల్‌ రసంలో అంతే మోతాదులో క్యారెట్‌ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో కాని దూదితో కాని ముఖానికి, మెడకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే ముఖం తాజాగా, నూతన కాంతులతో మెరుస్తుంది. పెరుగు, వెన్న, మీగడ సహజసిద్ధమైన క్లెన్సర్‌లు. వీటిని రోజూ కాని, తరచుగా కాని వాడుతుంటే చర్మం నిగనిగలాడుతుంది. స్నానం చేయడానికి కనీసం అరగంట ముందు పట్టిస్తుంటే వీటిలోని సుగుణాలు చర్మానికి బాగా పడతాయి. స్నానం పూర్తయ్యాక బాదం నూనె రాసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఇది చక్కని మాయిశ్చరైజర్‌ కాబట్టి శీతకాలంలో ప్రతిరోజూ రాసుకుంటే మంచిది.

తేనె, పెరుగు సహజమైన బ్లీచింగ్‌ ఏజెంట్స్‌. ఇవి కెమికల్‌ బ్లీచ్‌ కారణంగా వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్‌ను నిరోధిస్తా్తయి. రోజూ వాడుతున్నట్లయితే క్రమంగా చర్మం చాయ మెరుగు పడుతుంది. పదిహేను రోజులకొకసారి ఆలివ్‌ ఆయిల్‌లో చక్కెర కలిపి ఒంటికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోవడంతోపాటు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.  కొబ్బరి పాలు, పైనాపిల్‌ రసం సమపాళ్లలో తీసుకుని రెండింటినీ కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత లేదా ఆరిన తర్వాత ముఖాన్ని చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ను తరచుగా వేస్తుంటే చర్మం తెల్లగా మారుతుంది.

మరిన్ని వార్తలు