తెల్లసొనతో నల్లమచ్చలు మాయం

27 Jun, 2017 23:14 IST|Sakshi
తెల్లసొనతో నల్లమచ్చలు మాయం

బ్యూటిప్స్‌

ముఖం పేలవంగా, కాంతిహీనంగా, నల్ల మచ్చలు, ముడతలు నిండి ఉంటే కోడిగుడ్డులోని తెల్లసొన బాగా పని చేస్తుంది. రకరకాల కాంబినేషన్‌లతో ప్యాక్‌ వేసుకోవడం సాధ్యం కాని వాళ్లు కోడిగుడ్డు మాత్రమే ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందవచ్చు. మొదటగా ముఖాన్ని రోజూ వాడుతున్న సబ్బుతోనే శుభ్రంగా కడుక్కోవాలి. ఆరిన తర్వాత కోడిగుడ్డు పగలకొట్టి తెల్లసొనను మాత్రమే గిన్నెలోకి వంపుకోవాలి.

ఫోర్కుతో కాని ఎగ్‌ బీటర్‌తో కాని నురగ వచ్చేటట్లు కలిపి ఆ సొనలో దూదిని ముంచి ముఖానికి పట్టించాలి. గడ్డం నుంచి మొదలు పెట్టి పెదవులు, చెంపలు, ముక్కు, నుదురు అంతటికీ సమంగా పట్టించి ఆరే వరకు ఉండాలి.ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో ఏదైనా సబ్బు వాడి ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ముఖం మీద నల్ల మచ్చలు ఎక్కువగా ఉంటే వారానికి నాలుగైదు సార్లు ఈ ట్రీట్‌మెంట్‌ చేస్తే నెల రోజుల్లోనే ఫలితం ఉంటుంది.

కోడిగుడ్డు తెల్లసొన రాస్తే చర్మానికి నునుపుదనం వస్తుంది. తెల్లదనం తీసుకురావడంతోపాటు పొడిబారిన చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. కోడిగుడ్డు తెల్లసొన రాయడం వల్ల ముఖం ముడతలు పడకుండా ఉంటుంది. యంగ్‌గా కనిపిస్తారు.

మరిన్ని వార్తలు