పట్టు చీర... పసిబిడ్డతో సమానం

3 Aug, 2017 22:59 IST|Sakshi
పట్టు చీర... పసిబిడ్డతో సమానం

బ్యూటిప్స్‌

పట్టు చీరను కొనడం ఒక ఎత్తయితే, దానిని మెయిన్‌టెయిన్‌ చేయడం మరొక ఎత్తు. పట్టు చీరలను ఇంట్లో వాష్‌ చేయవచ్చా? తరతరాలుగా వేధిస్తున్న ప్రశ్న. పట్టు చీరను ఇంట్లోనే వాష్‌ చేయవచ్చు...

►మొదటి మూడు ఉతుకులకూ ఎటువంటి సబ్బులు వాడరాదు. చీరను చన్నీటిలో ముంచి తీసి ఆరవేయాలి. ఆ తర్వాత ఉతుకుల్లో కూడా గాఢతతో కూడిన రసాయనాల సబ్బులను వాడరాదు. మైల్డ్‌ డిటర్జెంట్స్‌ లేదా ప్రొటీన్‌ షాంపూలనే వాడాలి.

►చీర మెయిన్‌ కలర్, అంచు, పల్లు కాంట్రాస్ట్‌ కలర్స్‌ అయితే ఉతికేటప్పుడు చీరంతటినీ ఒకేసారి నీటిలో ముంచరాదు. అంచుల వరకు నీటిలో ముంచి ఆరేయాలి. తర్వాత పల్లును నీటిలో ముంచి ఆరేయాలి. ఆ తర్వాత అంచులను, పల్లును కట్టేసి, చీర బాడీని నీటిలో ముంచి ఆరవేయాలి. ఆరవేసేటప్పుడు నీరు పొడి ప్రదేశంలోకి జారకూడదు. అలా జారితే ఆ రంగు మరో రంగు మీద పడుతుంది.

►పట్టుచీరలను నేరుగా ఎండ తగిలేటట్లు ఆరవేయకూడదు. సూర్యరశ్మి వేడి తగులుతూ నేరుగా స్యూర్యకిరణాలు సోకని ప్రదేశాల్లో (వరండాల వంటి చోట) ఆరవేయాలి.

►పట్టు వస్త్రాలను బ్రష్‌తో రుద్దకూడదు. గట్టిగా పిండకూడదు, నీరుకారిపోవడానికి మెలితిప్పకూడదు. మెల్లగా చేత్తో నొక్కుతూ నీటిని పిండాలి.

►ఒక్కమాటలో చెప్పాలంటే పట్టు చీరను హ్యాండిల్‌ చేయడం, పసిబిడ్డను హ్యాండిల్‌ చేయడం ఒక్కటే.

మరిన్ని వార్తలు