ఇలా చేస్తే మరకలు మాయం

22 Sep, 2017 21:09 IST|Sakshi
ఇలా చేస్తే మరకలు మాయం

బ్యూటిప్స్‌

కొత్త తువ్వాళ్లను ఉతికేటప్పుడు సాధారణంగా రంగుపోతుంది. అలా పోకుండా ఉండాలంటే, తువ్వాళ్లను మొదటిసారి ఉతికేటప్పుడు అర కప్పు ఉప్పు జత చేసిన నీళ్లలో నానబెడితే సరి.స్కెచ్‌ పెన్నుల గీతలు దుస్తుల మీద పడినప్పుడు, ముందు కాస్తంత నెయిల్‌పాలిష్‌ రిమూవర్‌ వేసి రుద్ది, ఆ తరవాత సబ్బుతో రుద్దితే ఆ మరకలు ఇట్టే పోతాయి.బట్టలపై చాకొలేట్‌ మరకలు పడితే, ముందుగా కొద్దిగా బట్టల సోడా కలిపిన నీటిలో ఉంచి, కాసేపయ్యాక సబ్బుతో ఉతికేయాలి.పట్టుచీరలు ఉతికేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం నిమ్మరసం వేస్తే, రంగు, మెరుపుపోకుండా ఉంటాయి.
     
బట్టల మీద పడిన ఇంకు మరకలను పోగొట్టాలంటే, ముందుగా ఇంకు మరక ఉన్న చోట నిమ్మ చెక్కతో కాని, టూత్‌పేస్ట్‌తో గాని రాసి ఉతికితే సరి. మరో చిట్కా కూడా ఉంది. ఇంకు మరకలు పడిన చోట నీళ్లు జల్లి ఉప్పుతో రుద్ది, గోరువెచ్చటి నీళ్లలో ఉతికినా కూడా మరకలు మాయమవుతాయి.గ్రేవీ చిక్కగా రావాలంటే, కొద్దిగా కొబ్బరి పాలు లేదా గిలక్కొట్టిన పెరుగు వేసుకోవచ్చు.కూరలో నూనె ఎక్కువైతే, రెండు బ్రెడ్‌స్లైసుల్ని పొడిలా చేసి అందులో వేస్తే సరి.

మరిన్ని వార్తలు