బ్యూటిప్స్‌

4 Nov, 2017 00:06 IST|Sakshi

ఉసిరికాయ రసం సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్‌. ఈ రసంలో దూది అద్ది ముఖాన్ని తుడిస్తే కాలుష్యం, జిడ్డు వదిలి చక్కగా శుభ్రపడుతుంది. ఉసిరిని ఎండబెట్టి పొడి చేసుకుని తలకు పట్టించవచ్చు. ఇనుప పాత్రలో ఉసిరికాయ పొడి, తగినంత నీరు పోసి ఒక గంట నాననివ్వాలి. దీంతో తలరుద్దుకుంటే షాంపూగానూ, కండిషనర్‌గానూ, తెల్లజుట్టును బ్రౌన్‌గా మార్చే హెయిర్‌ డై గానూ మూడు ప్రయోజనాలు చేకూరుతాయి. 

జుట్టురాలడం, తెల్లబడడం, పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలకు, చుండ్రునివారణకు హెన్నాలో ఆమ్లపౌడర్‌ కలిపి తలకు పట్టించాలి. ఆమ్లపౌడర్‌ కోసం సౌందర్యసాధనాల మార్కెట్‌లో దొరుకుతుంది. అది సాధ్యం కానప్పుడు ఉసిరి కాయలను గింజలు తీసి మెత్తగా గ్రైండ్‌ చేసి హెన్నాలో కలుపుకోవచ్చు.

మరిన్ని వార్తలు