పాలు కారే ముఖ సౌందర్యం కోసం సహజ చిట్కాలు

21 Aug, 2019 07:48 IST|Sakshi

సరైన పద్ధతులలో సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.  సులువుగా ఇంట్లో లభించే పదార్థాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన చర్మ రక్షణ  సుల ం కావడంతోపాటు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

మీది జిడ్డు చర్మం అయితే అరకప్పు కాచి చల్లార్చిన పాలలో ఒక ఐసుముక్కను వేసి, అది ఆ పాలలో పూర్తిగా కరిగాక పాలలో చిన్న చిన్న దూది ఉండలు వేసి, వాటితో పాలను ముఖానికి పట్టించి, ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఫలితంగా చర్మం పైన ఉండే నూనెలు తొలగి, ముఖచర్మం మృదువుగా... తాజాగా మెరుస్తుంటుంది.
కప్పు పాలలో శుభ్రమైన పలుచటి కాటన్‌ కర్చీఫ్‌ లేదా ఏదైనా వస్త్రాన్ని నానబెట్టండి. కాసేపయ్యాక దానిని తీసుకుని కళ్ళు మూసుకొని, ముఖం పైన కప్పుకోండి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగివేయండి.
రెండు మూడు బాగా పండిన టమాటాలను ఉడకబెట్టి, చల్లారాక గుజ్జులా చేయండి. ఆ గుజ్జును కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచండి, దీనిని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రంగా కడగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
చర్మాన్ని ఆరోగ్యంగా త్వరగా ప్రకాశవంతంగా మార్చడానికి ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. తేనె అందులో మొదటిది. అప్పుడప్పుడు ముఖ చర్మానికి తేనె, పసుపు, చందనం కలిపిన మిశ్రమాన్ని రాస్తుండాలి. వాటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా చర్మం పైన ఉండే మచ్చలకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, తేనె చర్మాన్ని మృదువుగా, సున్నితంగా పట్టులా మార్చేస్తుంది.

ముఖంపై ఉండే మచ్చల కోసం...
ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నాయా? అయితే ఫ్రిజ్‌ నుంచి తీసిన తాజా దోసకాయ రసంలో కాటన్‌ బాల్‌ లేదా చిన్న నూలు బట్ట ముక్కను ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన కొంత కాలం తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలు మాయమైపోతాయి.

మరిన్ని వార్తలు